అనుపమ్ ఖేర్ ఫ్యామిలీని వెంటాడిన కరోనా.. ఎవరెవరికి పాజిటివ్ అంటే?
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. ఇంట్లో అందరికీ పాజిటివ్ వచ్చిందని, తనకు మాత్రం నెగెటివ్ వచ్చిందని అనుపమ్ ఖేర్ తాజాగా ఓ వీడియో ద్వారా అందరికీ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌లో ఇప్పటికే బచ్చన్ ఫ్యామిలీలో కరోనా విజృంభించగా.. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఇంట్లోనూ కరోనా కోరలు చాచింది. ఇంతకీ అనుపమ్ ఖేర్ చెప్పిన విషయాలేంటో ఓ సారి చూద్దాం.

అనుపమ్ ఖేర్ తల్లి..
అనుపమ్ ఖేర్ తన తల్లి ఆకలి వేయడం లేదని చెప్పిన తరువాత డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడట. అక్కడ అన్నీ పరీక్షలతో పాటు కోవిడ్ టెస్ట్‌లు కూడా చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరూ నిర్ఘాంతపోయారట. దీంతో కుటుంబ సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారట.

కుటుంబమంతటికీ కరోనా..
అనుపమ్ ఖేర్ సోదరుడు రాజు ఖేర్, ఆయన భార్యకు, కోడలికి అందరికీ కరోనా వచ్చినట్టుగా ప్రకటించాడు. అయితే తనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని అనుపమ్ ఖేర్ ప్రకటించాడు. దీంతో ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

కోకిలాబెన్ ఆస్పత్రిలో..
‘మా అమ్మను, అన్నను ,వదినను, పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని కోకిలా బెన్ హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. నాకు నెగెటివ్ వచ్చింది. బీఎంసీకి సమాచారం ఇచ్చాం' అని అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Recommended Video

మరోవైపు బచ్చన్ ఫ్యామిలీ..
మరోవైపు బచ్చన్ ఫ్యామిలీ కూడా కరోనా కోరల్లో చిక్కుకుంది. అమితాబ్, అభిషేక్‌లకు కరోనా సోకింది. అయితే ఆ ఫ్యామిలీలోని మిగతా వారికి నెగెటివ్ వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు బచ్చన్ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











