ఆయన పేరు కూడా బయటపెట్టాను.. మీకు దమ్ముంటే అడగండి.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం, కంగనా రనౌత్ నెపోటిజంపై మళ్లీ చర్చ లేవనెత్తడం, బాలీవుడ్ రెండుగా వీడిపోవడం, ఒకరినొకరు దూషించుకోవడం జరుగుతూనే ఉంది. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఇదే తంతు జరుగుతోంది. తాజాగా కంగనా రనౌత్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద చర్చకు లేవనెత్తింది. ఆమె ఎన్నో విషయాలపై స్పందిస్తూ.. సినీ పెద్దలను టార్గెట్ చేసింది. మధ్యలో తాప్పీ, స్వర భాస్కర్ వంటి వారిని సైతం ప్రస్థావించింది. ఇలా కంగనా రేపిన చిచ్చు సోషల్ మీడియాలో కార్చిచ్చులా మారింది.

మళ్లీ రచ్చ..
అసలే సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్, రాజకీయ నాయకులు, నెటిజన్లు డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. రీసెంట్‌గా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి సైతం అమిత్ షాకు విన్నవించుకుంది. వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరింది.

కంగనాపై భిన్న కామెంట్స్..
కంగనా లేవనెత్తిన అంశాలు, ఆమె వాడిన పదాలు కొందరినీ బాధించగా.. మరికొందరినీ ఆలోచించేలా చేశాయి. తాప్సీ, స్వర భాస్కర్‌ను గురించి మంచిగానే చెప్పినా.. బీ గ్రేడ్ యాక్టర్స్ అని అనడంతో అందరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కంగనా మాట్లాడిన అంశాలను లేవనెత్తుతూ.. సోషల్ మీడియాలో అనురాగ్ కశ్యప్‌పైనా ట్రోల్ జరుగుతూ వచ్చింది.

మాఫియా చేతిలో కీలుబొమ్మ..
ఇండస్ట్రీలో ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు. అయితే కొందరు మాత్రం లైమ్ లైట్‌లోకి వచ్చేముందు ఇలాంటి ఆరోపణలు చేస్తూ హల్చల్ చేస్తుంటారని నటుడు రన్ వీర్ షోరే కామెంట్ చేయగా..దానిని ఓ నెటిజన్ స్పందిస్తూ.. దాని అనురాగ్ కశ్యఫ్ ఓ మంచి ఉదాహరణ.. అతను బాలీవుడ్ గ్యాంగ్ మాఫియాలో కీలుబొమ్మ అంటూ కామెంట్ చేశాడు.

నాతో సినిమాలు తీయరు..
సదరు నెటిజన్ కామెంట్‌కు స్పందించిన అనురాగ్ కశ్యప్.. ‘బాలీవుడ్‌లో నాపెత్తనం చెల్లదు.. నాతో సినిమాలు తీసేందుకు ధర్మ, ఎక్సెల్, యశ్ రాజ్ చోప్రా వంటి ప్రొడక్షన్ కంపెనీలు రావు. నాకు నేనుగా కొత్త కంపెనీ పెట్టుకోవాలి.. పెట్టుకున్నాను కూడా. కంగనాకు ఎలాంటి పని లేనప్పుడు క్వీన్ సినిమాను చేశాను.
Recommended Video

పేరు కూడా బయట పెట్టాను..
తను వెడ్స్ మను సినిమా సమయంలోనూ సాయం చేశాను. ఆ సినిమా మధ్యలో ఆగిపోతే.. ఆనంద్ ఎల్ రాయ్‌కు మద్దతిచ్చాను. ఫైనాన్షియర్లతో మాట్లాడాను. మీరు అడగాలనుకుంటే వారిని అడగొచ్చు. ఎందుకంటే నేను వారి పేరు తీసుకొనే మాట్లాడతాను నిజం ఎక్కడైనా మాట్లాడతాను' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











