అనురాగ్ కశ్యప్‌కు స్వల్ప గుండెపోటు.. హాస్పిటల్‌లో పరిస్థితి ఎలా ఉందంటే!
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ముంబైలోని హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నది అని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
అనురాగ్ కశ్యప్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సన్నిహితుడు మీడియాతో మాట్లాడారు. అనురాగ్‌కు స్వల్పంగా ఛాతిలో నొప్పి రావడంతో చెకప్ చేయించాం. అయితే గుండెలో కొన్ని బ్లాకేజేస్ ఉన్నాయనే విషయం రిపోర్టుల్లో తేలింది. వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాం. అనంతరం ఆయనకు ఆంజియోప్లాస్టీ జరిపించారు. సర్జరీ తర్వాత ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది అని తెలిపారు.

అనురాగ్ కశ్యప్ వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వెంటనే ప్రొఫెషనల్ పనులు చేపట్టవద్దని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యానికి ప్రమాదం లేదని చెప్పారు.
కొద్దికాలం క్రితం అనురాగ్ కశ్యప్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై నటి పాయల్ ఘోష్ దారుణమైన వ్యాఖ్యలుచేశారు. తనకు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశాడు అంటూ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తనపై వచ్చిన ఆరోపణలను అనురాగ్ ఖండించారు. ఈ విషయంలో ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో అనురాగ్‌పై పాయల్ ఘోష్ కేసు నమోదు చేయడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











