twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కూతుర్ని మీ కార్యర్తలు రేప్ చేస్తారంట.. ఎలా డీల్ చేయాలో చెప్పండి.. మోదీకి దర్శకుడి చురక

    |

    దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురిని రేప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో చేసిన బెదిరింపుల వ్యవహారంలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురుపై మోదీ అభిమానులు చేసిన బెదిరింపులపై ప్రధానికి అనుగార్ కశ్యప్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన అనురాగ్ కశ్యప్‌ను ఫలితాల అనంతరం కొందరు సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడటం చర్చానీయాంశమైంది. ఈ వ్యవహారంలో అసలేం జరిగిందంటే..

     మీ పార్టీ మూకల్ని ఎలా

    మీ పార్టీ మూకల్ని ఎలా

    సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఘనవిజయం సాధించడంతో ప్రధానికి అభినందనలు తెలుపుతూనే చురకలు అంటించారు. డియర్ నరేంద్రమోదీ సర్.. మీరు. మీ పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు. కానీ మీ ఫాలోవర్స్ వ్యవహరిస్తున్న తీరుకు థాంక్స్. నా కూతురును రేప్ చేసి వేడుక చేసుకొంటామని మీ అభిమానులు బెదిరిస్తున్నారు. ఇలాంటి మూకలను ఎలా డీల్ చేయాలో కాస్త చెప్పండి అంటూ అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు.

    ముంబై పొలీసు విభాగానికి థ్యాంక్స్

    ముంబై పొలీసు విభాగానికి థ్యాంక్స్

    ఈ వ్యవహారంలో నా ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు, మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగానికి థ్యాంక్స్. మూకలను గుర్తించడానికి తీసుకొన్న చర్యలు, మాకు మద్దతుగా నిలిచినందుకు థ్యాంక్యూ. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్. ఇప్పుడు నేను ఎలాంటి భయంతో లేకుండా చాలా భద్రతతో ఉన్నాను అని అనురాగ్ ట్వీట్ చేశారు.

    ప్రధాని మోదీకి ట్యాగ్ చేయడం ఎందుకు

    ప్రధాని మోదీకి ట్యాగ్ చేయడం ఎందుకు

    అనురాగ్ కశ్యప్ ట్వీట్‌కు బదులిస్తూ.. నటి సుచిత్ర కృష్ణమూర్తి స్పందించారు. మోదీకి అనుకూలమైన నాకే బెదిరింపులు వచ్చాయి. నా కూతురును కూడా రేప్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వివాదంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ మీరు సోషల్ మీడియాలో మీ ట్వీట్‌ను ప్రధానికి ట్యాగ్ చేయడంలో అర్ధమేమన్నా ఉందా అంటూ సుచిత్ర ప్రశ్నించారు. అందుకు జవాబుగా ఆయన పార్టీ మూకల్ని కట్టడి చేసేందుకు అవకాశముంటుందని ట్యాగ్ చేశాను అంటూ అనురాగ్ స్పందించారు.

    ఐపీసీ, ఐటీ యాక్టు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు

    ఐపీసీ, ఐటీ యాక్టు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు

    దర్శకుడి అనురాగ్‌కు పలువురు సోషల్ మీడియాలో మద్దతుగా నిలుస్తున్నారు. మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అనురాగ్ కశ్యప్ ఫిర్యాదుకు స్పందించిన అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 సెక్షన్ కింద, అలాగే ఐపీసీ 504, 509 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం.

    English summary
    Director Anurag Kashyap questions PM Modi. he tweeted that "Dear narendramodi sir. Congratulations on your victory and thank you for the message of inclusiveness. Sir please also tell us how do we deal with these followers of yours who celebrate your victory by threatening my daughter with messages like this for me being your dissenter."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X