ప్రేమలో పడ్డ ప్రముఖ దర్శకుడి మాజీ భార్య.. ఈసారి ఎవరితోనంటే..
ప్రముఖ దర్శకుడి మాజీ భార్య, బాలీవుడ్ నటి కల్కి కోష్లిన్ మళ్లీ ప్రేమలో పడింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తూ తీసుకొన్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయడం జరిగింది. దాంతో భర్తతో విడిపోయిన తర్వాత ఆమె ఎవరితోనో రిలేషన్‌షిప్ కొనసాగిస్తుందనే గుసగుసలకు ఆ ఫోటో తెర దించింది. ఇంతకు కల్కి కోష్లిన్ ప్రేమలో పడింది ఎవరితోనంటే..

మ్యూజిక్ లవర్‌తో అఫైర్
ఇజ్రాయేల్‌కు చెందిన గయ్ హెర్ష్‌బెర్గ్ మ్యూజిక్ కంపోజర్, టీజర్, పియానిస్ట్. జాజ్ మ్యూజిక్‌లో ప్రావీణ్యం సాధించాడు. క్లాసికల్ మ్యూజిక్, పియానో శిక్షణ తరగతులను జెరుసలేం అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్‌లో నేర్చుకొన్నాడు. మ్యూజిక్ రంగంలో రాణిస్తున్న గయ్‌కి కల్కితో పరిచయం ఏర్పడి ప్రేమ వ్యవహారానికి దారి తీసింది.

ప్రియుడి కుటుంబంతో సన్నిహితంగా
కల్కితో ప్రేమకు గయ్ కుటుంబం నుంచి సపోర్ట్ ఉంది. గయ్ త్లలి మీరా హెర్ష్‌బర్గ్‌తో కల్కికి సత్సంబంధాలు ఉన్నాయి. తాజా వెకేషన్‌లో దిగిన ఫోటో వైరల్‌గా మారింది. నాకు ఇష్టమైన వ్యక్తితో కలిసి ఉండే ప్రతీ రోజు ఆదివారమే అంటూ కామెంట్ చేసింది. నీ ముఖంపై చిగురించిన నవ్వు నాకు మరింత అందంగా మార్చేసింది. అందుకు కారణం నువ్వే అంటూ గయ్ బదులిచ్చాడు. కల్కి బుగ్గపై గయ్ ముద్దుపెడుతున్న ఫోటోను మీరా కూడా షేర్ చేయడం గమనార్హం.

ప్రియుడితో కలిసి మధుర క్షణాలు
గయ్ హెర్ష్‌బర్గ్‌తో కలిసి ఉన్న క్షణాలను, ఫోటోలను నెటిజన్లతో కల్కి పంచుకొన్నారు. గయ్ పియానో ప్లే చేస్తున్న ఫోటోను. వెకేషన్‌లో రూమ్ కోసం వెయిట్ చేస్తున్న క్షణాలను, ప్రియుడితో కలిసి చేస్తున్న భోజనం ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.

అనురాగ్ కశ్యప్‌తో వివాహం
ఇక కల్కి వ్యక్తిగత జీవితానికి వస్తే, తొలుత ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో వివాహం జరిగింది. ఆయనతో కలిసి దేవ్ డీ అనే సినిమాలో పనిచేసింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత 2011లో వారిద్దరూ వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత 2015లో విడిపోయారు.

విడిపోయినా క్లోజ్ ఫ్రెండ్స్‌గా
అనురాగ్ కశ్యప్‌తో వైవాహిక బంధాన్ని తెంచుకొన్నప్పటికీ.. వారిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు. వారిద్దరూ సెక్రెడ్ గేమ్స్2 సినిమాS2లో కలిసి ఇటీవల పనిచేశారు. ఇక ఈ మధ్య రిలీజైన జోయా అఖ్తర్ దర్శకత్వం వహించిన గల్లీబాయ్స్ చిత్రంలో నటించి మెప్పించింది. మేడ్ ఇన్ హెవెన్, సెక్రెడ్ గేమ్స్ 2 అనే డిజిటల్ మీడియాలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











