యాంజియోప్లాస్టీ సర్జరీ.. అస్సలు గుర్తు పట్టలేని విధంగా మారిన స్టార్ డైరెక్టర్!

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు కొద్ది రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో ముంబైలోని హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనురాగ్‌కు స్వల్పంగా ఛాతిలో నొప్పి రావడంతో చెకప్ చేయించడంతో గుండెలో కొన్ని బ్లాకేజేస్ ఉన్నాయనే విషయం రిపోర్టుల్లో తేలింది. దీంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్పించడంతో ఆయనకు ఆంజియోప్లాస్టీ జరిపించారు.

‘యాంజియోప్లాస్టీ'

‘యాంజియోప్లాస్టీ'

ముంబైలోని ఒక ప్రముఖ హృద్రోగ నిపుణుడు ఆయనకు 'యాంజియోప్లాస్టీ' సర్జరీ చేశారు. ప్రస్తుతం కశ్యప్ పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన మేనేజర్ కొద్ది రోజుల క్రితం మీడియాకి తెలియజేశారు. కాకపోతే, వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని వెల్లడించారు.

షాకింగ్ లుక్ లో

షాకింగ్ లుక్ లో

అనురాగ్ ఇంట్లో కోలుకుంటున్న నేపథ్యంలో కుమార్తె ఆలియా ఒక వీడియోను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆలియా తన తండ్రి వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన తన బట్టతలతో కనిపిస్తున్నారు. ఇక నీలిరంగు సాదా టీ-షర్టు వేసుకున్న అనురాగ్ వీడియో కోసం నవ్వుతూ కనిపించారు. ఒకరకంగా షాకింగ్ లుక్ లో కనిపిస్తున్నారు అని చెప్పక తప్పదు.

 ‘దోబారా' రెడీ

‘దోబారా' రెడీ

ఇక మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆలియా బాగా ఫేమస్. ప్రస్తుతం ఆమె యుఎస్ లో చదువుతున్నారు. అయితే కరోన నేపధ్యంలో ఆమె ఇటీవల ముంబైకి తిరిగి వచ్చింది. ఇక అనురాగ్ విషయానికి వస్తే తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'దోబారా' సినిమా ఇప్పటికే పూర్తి చేశారు. ఆ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది.

ఐటీ రైడ్స్

ఐటీ రైడ్స్

అయితే కొద్ది రోజుల క్రితం ఫాంటమ్ ప్రొడక్షన్ కంపెనీలో జరిగిన అవకతవకలు, పన్ను ఎగవేత లపై సమాచారంతో ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. అనురాగ్ కశ్యప్, తాప్సీ, వికాస్ భల్, విక్రమాదిత్య వంటి వారి ఇళ్ళలో సోదాలు జరిపింది. అయితే మొత్తంగా రూ. 650 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని ఐటీ శాఖ తెలిపింది.

Recommended Video

#IndiaTogether : Rihanna Tweet తో కదిలిన Bollywood
లైంగిక ఆరోపణలు

లైంగిక ఆరోపణలు

అయితే ఇంత జరిగినా కూడా అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అవ్వలేదు. ఆ అంతకు ముందు కూడా అనురాగ్ కశ్యప్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన మీద నటి పాయల్ ఘోష్ దారుణమైన ఆరోపణలు చేశారు. తనకు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశారు అంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అనురాగ్ ఖండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X