రెండు కొప్పుల మధ్యదూరి తలబొప్పికట్టించుకున్న డైరెక్టర్... కంగన, తాప్సీ గొడవలో అనురాగ్

బాలీవుడ్ లో నెపోటిజంపై జరుగుతున్న గొడవ ముదిరి పాకాన్న పడిందనే చెప్పాలి. ఓ వైపు బంధుప్రీతి నశించాలి అంటూ కంగన రనౌత్ చేస్తున్న యుద్ధానికి లభిస్తున్న మద్ధతుకన్నా, ఆమె నోటి దురుసుతనానికి, వ్యతిరేకత ఎక్కవ అవుతోంది. ఇందులో భాగంగానే తాప్సీ, స్వరా భాస్కర్ తో పేచీ పెట్టుకున్న వైనం తెలిసిందే. అయితే, ఈ మ్యాటర్ లోకి తలదూర్చి తలబొప్పికట్టించుకున్నానంటూ తాజాగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించడం మరో విడ్డూరంగా మారింది.

ఇంతకూ విషయం ఏమిటంటే, "మన్మర్జియా" సమయంలోనే కంగనా, తాప్సీ నడుమ పేచీ మొదలైంది. అస్తమానం సమస్యలు కొని తెచ్చుకునే కంగనకు డబుల్ ఫిల్టర్ ఇవ్వాలనుకుంటున్నట్లు తాప్సీ వ్యాఖ్యానించడంతో కంగన ఒక్కసారిగా భగ్గుమంది. అదే సమయంలో తాప్సీకి, కంగన అక్క రంగోలికి నడుమ సాగిన ఆన్ లైన్ వార్ లో అనురాగ్ తాప్సీని సమర్ధిస్తూ ట్వీట్లు చేశాడు.

Anurag kasyap gets into the catfight, Forced to giveup

తాప్సీ, కంగనతో మంచి స్నేహం ఉన్న అనురాగ్ అప్పట్లోనే వీరిద్దరి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ, ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో అతడు చివరికి చేతులెత్తేయక తప్పలేదు. ఇక తాజా మాటల యుద్ధంతో పరిస్థితి మరింత దిగజారిందని వెల్లడించాడు.

Recommended Video

Malli Malli Chusa Movie Public Talk | Anurag Konidena | Shweta Avasthi

తాను ఏ సినిమా చేసినా, అద్భుతంగా ఉందంటూ మెచ్చుకునే మంచి స్నేహితురాలు కంగన అని తెలిపిన అనురాగ్, ఇప్పటి కంగన ఎవరో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏమైనా, రెండు కొప్పుల మధ్య తలదూర్చితే ఏమవుతుందో అనురాగ్ కు అనుభవపూర్వకంగా తెలిసివచ్చిందనే చెప్పాలి. మరి కంగన ఈ మాటల యుద్ధాన్ని ఎంతవరకూ తీసుకువెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X