ఐటీ రైడ్స్ అయినా కూడా.. అనురాగ్ కశ్యప్ రియాక్షన్ ఇదే!
గత రెండు మూడు రోజుల నుంచి తాప్సీ, అను రాగ్ కశ్యప్ పేర్లు సోషల్ మీడియా, మీడియాలో మార్మోగిపోతోంది. ఫాంథమ్ ప్రొడక్షన్ కంపెనీలో జరిగిన అవకతవకలు, పన్ను ఎగవేతలపై సమాచారంతో ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. అనురాగ్ కశ్యప్, తాప్సీ, వికాస్ భల్, విక్రమాదిత్య వంటి ప్రముఖుల ఇంట్లో సోదాలు జరిపింది. అయితే మొత్తంగా రూ. 650 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని ఐటీ శాఖ తెలిపింది.
ఫాంథోమ్ బ్యానర్‌పై నిర్మించిన సినిమాలు, వాటి లెక్కల్లో తేడా చూపించడంతో ఆదాయాల్లో భారీగా మార్పులు వచ్చాయని, తాప్సీకి సంబంధించిన ఐదు కోట్ల వివరాలు కూడా తేడా కొడుతున్నాయని ఐటీ శాఖ తెలిపింది. అనురాగ్ కశ్యప్, తాప్సీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఇతర ఆదాయ మార్గాలపైనా ఐటీ శాఖ కన్నేసింది. అయితే ఇంత జరిగినా కూడా తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఇద్దరూ కూడా రియాక్ట్ అవ్వలేదు.

సింపుల్‌గా ఈ విషయాన్ని అలా వదిలేసి తమ తమ సినిమా పనుల్లో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ దోబారా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మళ్లీ షూటింగ్ ప్రారంభించేశాను.. నన్ను ద్వేషించే వారికి కూడా ప్రేమతో ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ అనురాగ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మరో వైపు తాప్సీకి టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి మద్దతు లభిస్తోంది.


Click it and Unblock the Notifications











