బర్త్ డే రోజున అనుష్క శర్మ ఎమోషనల్.. ఆవేదనతో కవిత రాసిన బ్యూటీ

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకొన్నారు. తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి కేక్ కట్ చేసి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకొన్నారు. లాక్ డౌన్ కొనసాగడం, బాలీవుడ్‌లో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి అగ్ర నటులు మరణం చెందడంతో ఆమె విషాదంలో మునిగిపోయారు. ఆ కారణంగా జన్మదిన వేడుకలను హంగామా మధ్య జరుపుకోవడానికి నిరాకరించారు. అనుష్క శర్మ మే 1 తేదీన 32 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో తన భర్తతో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేశారు. నీవు నా ప్రపంచంలోకి ప్రేమ అనే కాంతిని తీసుకొచ్చావు. నీ జీవితంలో ప్రతీ రోజు వెలుగు నింపుతున్నావు. ఐ లవ్ యూ అంటూ ఆమె ఓ సందేశాన్ని పోస్టు చేశారు. అంతకు ముందు ఇర్ఫాన్, రిషిని స్మరించుకొంటూ వారి ఫోటోలను కూడా పోస్టు చేశారు.

Anushka Sharma celebrated birthday with Virat Kohli: pens emotionally peotry

ఈ సందర్భంగా..ప్రస్తుతం ఆమె చుట్టూ నెలకొన్న పరిస్థితులపై ఆమె కవితాధోరణిలో భావోద్వేగంగా స్పందించారు. ఈ మేరకు ఓ కవితను రాసి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

నా చుట్టూ ఉన్న విషాదం దూరం కావాలి.. ఈ కష్టాలన్నీ ఇక శాశ్వతంగా తొలిగిపోవాలి అంటూ ఓ కవితను రాసి తనలోని భావాలను అభిమానులతో పంచుకొన్నారు. ఆ కవిత పూర్తిగా మీ కోసం..

తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ కంపెనీలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందించిన వెబ్ సిరీస్‌ పాతాళ లోకంకు సంబంధించిన టీజర్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆవిష్కరించారు. ఈ సిరీస్‌లో గుల్ పనాగ్, జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X