For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క తల్లి కాబోతుందా.? అందుకే సినిమాలకు దూరమైందా? కోహ్లీ భార్య షాకింగ్ రియాక్షన్

  By Manoj Kumar P
  |

  చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న నటీమణి అనుష్క శర్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా విజయవంతమైన చిత్రాల్లోనే నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అదే సమయంలో టీమిండియా క్రికెటర్ కోహ్లీతో ప్రేమాయణం, పెళ్లితో మరింత హైలైట్ అయింది. తాజాగా ఆమె తల్లి కాబోతుందని ఓ న్యూస్ వైరల్ అయింది. దానికి అనుష్క షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

  Anushka Sharma Serious Recation on Her Pregnancy Rumors
  రీల్ పార్ట్‌నర్స్.. రియల్ పార్ట్‌నర్స్ అయిపోయారు

  రీల్ పార్ట్‌నర్స్.. రియల్ పార్ట్‌నర్స్ అయిపోయారు

  వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న అనుష్క.. కోహ్లీ ఓ షాంపూ కంపెనీ కోసం ప్రకటనలో నటించారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట.. ఒకానొక సమయంలో సీక్రెట్ రివీల్ చేసింది. ఆ తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా విరాట్ - అనుష్క ‘విరుష్క' అయిపోయారు.

  అందులో మాత్రం ఇద్దరూ ఇద్దరే.. తగ్గేదే లేదు

  అందులో మాత్రం ఇద్దరూ ఇద్దరే.. తగ్గేదే లేదు

  కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ భాగం అయిపోయింది. అనుష్క, కోహ్లీని దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీళ్లిద్దరూ ఖాళీగా ఉన్న సమయంలో సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉంటారు. అంతేకాదు, తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు.

  కోహ్లీ ఫెయిల్యూర్‌కు అనుష్కనే అసలు కారణం

  కోహ్లీ ఫెయిల్యూర్‌కు అనుష్కనే అసలు కారణం

  అనుష్కతో కోహ్లీ ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి ఈ జంట తరచూ హైలైట్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా విరాట్ తన ఆటలో విఫలం చెందిన ప్రతిసారీ.. ఆమెను నిందిస్తూనే ఉన్నారు. అనుష్క మాయలో పడడం వల్లే కోహ్లీ ఫెయిల్ అవుతున్నాడని విమర్శలు వెల్లువెత్తేవి. దీనికి కోహ్లీ కూడా పలుమార్లు సీరియస్ అయిన విషయం తెలిసిందే.

  తల్లి కాబోతున్న అనుష్క శర్మ.. అందుకే అలా..

  తల్లి కాబోతున్న అనుష్క శర్మ.. అందుకే అలా..

  ఇక, ఇటీవల బాలీవుడ్‌ సర్కిళ్లలో అనుష్క శర్మ గురించి ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. అదే... ఆమె తల్లి కాబోతుందన్న విషయం. అవును.. అనుష్క తల్లి కాబోతుందని, అందుకే ఆమె సినిమాలను ఒప్పుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనికి అనుష్క కానీ, కోహ్లీ కానీ స్పందించకపోవడంతో ఆ వార్తలు వైరల్ అయిపోతున్నాయి.

  ప్రెగ్నెన్సీ వార్తలపై అనుష్క షాకింగ్ రియాక్షన్

  ప్రెగ్నెన్సీ వార్తలపై అనుష్క షాకింగ్ రియాక్షన్

  కొద్ది రోజులుగా తన ప్రెగ్నెన్సీపై వస్తున్న వార్తలపై అనుష్క తాజాగా స్పందించింది. సోషల్ మీడియా లైవ్‌లో ఇదే ప్రశ్న ఓ నెటిజన్ అడగగా.. ‘నేను సినిమాలు చేయట్లేదంటే.. తల్లినవుతున్నా అని అర్థం కాదు. నాకు నచ్చిన కథలు రావడం లేదని. అయినా పిల్లల్ని ఎప్పుడు కనాలో నాకు తెలుసు. మా లైఫ్‌లో మీ జోక్యం అవసరం లేదు' అని ఫైర్ అయింది.

  టీమిండియా కెప్టెన్‌గా మారుతున్న అనుష్క

  టీమిండియా కెప్టెన్‌గా మారుతున్న అనుష్క

  అనుష్క శర్మ.. గత ఏడాది ‘జీరో' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షారూఖ్, కత్రినాతో కలిసి ఆమె నటించిన ఈ సినిమా పరాజయం పాలయింది. ఇక, ప్రస్తుతం ఆమె ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో నటించనుంది. ఈ పాత్ర కోసం అనుష్క క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటోంది.

  English summary
  Anushka Sharma and Virat Kohli, who got married in Italy in 2017, frequently make appearances on each other's Instagram profiles and we simply love it when that happens. On Valentine's Day this year, Virat shared a lovely picture on Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X