Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
క్రికెటర్ హర్దీక్ పాండ్యా వీడియో వైరల్.. అనుష్క శర్మ ఫిదా.. ఏం చేశారంటే!
క్రికెటర్ హార్థిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిక్ దంపతులు కొద్ది నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఆ బాబుకు ఆగస్త్య పాండ్యా అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 14 సీజన్ బిజీలో ఉన్న హార్థిక్ పాండ్యా తన కుటుంబంతోపాటు పలు ప్రాంతాలకు ట్రావెల్ అవుతున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు అగస్త్యకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది. ఆ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..
కొడుకును ముద్దు చేస్తూ హర్ధీక్ పాండ్యా
ఐపీఎల్ 14 సీజన్ బిజీ షెడ్యూల్లో కూడా తన కుమారుడు అగస్త్య పాండ్యాను హార్థిక్ ముద్దు చేస్తూ ఉండటం అందర్నీ ఆకట్టుకొన్నది. తన కొడుకును అందంగా తయారు చేస్తూ ఉండటం ముచ్చటేసింది. అగస్త్యాను ఎత్తుకొని గాల్లోకి ఎగురవేస్తూ హార్తిక్ తన ఆనందాన్ని వీడియో రూపంలో పంచుకొన్నాడు.
హర్ధీక్ పాండ్యా ఎమోషనల్ మెసేజ్
అగస్త్య వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో హార్థిక్ పాండ్యా షేర్ చేస్తూ.. మా అబ్బాయి.. నా గుండె చప్పుడు.. నా జీవితం అంటూ మెసేజ్ పెట్టి పోస్టు చేశాడు. ఆ వీడియోకు అర్జిత్ సింగ్ పాడిన మై తేరా అనే పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టారు. ఆ వీడియో కొద్ది సేపట్లోనే వైరల్ అయింది. ఆ వీడియోకు 1 మిలియన్‌పైగా లైక్స్, 5 వేలకు పైగా కామెంట్స్ రావడం విశేషం.
ముచ్చటపడిన అనుష్క శర్మ
హర్ధీక్ పాండ్యా ముద్దు ముచ్చట చూసి బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఫిదా అయింది. హర్దీక్ పాండ్యా ప్రేమను, కొడుకుపై ఆలనా పాలనను చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే లవ్ సింబల్‌ను పెట్టి తన ప్రేమను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది.
కూతురు వమికాతో ఎంజాయ్
ఇక అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు విషయానికి వస్తే వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. వారిద్దరు జనవరి 11వ తేదీన వమికా కోహ్లీ అనే చిన్నారికి జన్మనిచ్చారు. ప్రస్తుతం కూతురు ఇంట్లో అడుగుపెట్టిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
అనుష్క శర్మ కెరీర్ ఎలా ఉందంటే..
అనుష్క కెరీర్ విషయానికి వస్తే.. హీరోయిన్గా కంటే నిర్మాతగా బాగా రాణిస్తున్నారు. లాక్డౌన్లో పాతాళ్ లోక్, బుల్బుల్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఖాలా అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు బుల్బుల్ డైరెక్టర్ అన్విత దత్ దర్శకత్వం వహిస్తున్నారు.