‘పాతాల్ లోక్’లో అనుష్క శర్మ హంగామా.. లాక్‌డౌన్‌లో గ్రాండ్‌గా సక్సెస్ పార్టీ
బాలీవుడ్ అందాల నటి అనుష్క శర్మ నిర్మాతగా మారి రూపొందించిన వెబ్ సిరీస్ పాతాళ్ లోక్‌కు మంచి ప్రేక్షకదారణ లభించింది. ఈ వెబ్ సిరీస్ విమర్శకులను సైతం ఆకట్టుకోవడం, మంచి రివ్యూలు రావడంతో యూనిట్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సక్సెస్ పార్టీని నిబంధనలుకు లోబడి ఏర్పాటు చేసుకొన్నారు. అనుష్క శర్మ ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీ ఎక్కడంటే..

అమెజాన్‌లో పాతాల్ లోక్
పాతాల్ లోక్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్నది. ఈ వెబ్ సిరీస్‌లో నీరజ్ కాబీ లాంటి ప్రముఖ జర్నలిస్టు యాంకర్ కీలక పాత్రను పోషించారు. ఈ సిరీస్‌కు అవినాష్ అరున్ ధావ్రే, ప్రోసిత్ రాయ్ (పరి ఫేం) సదీప్ శర్మ (రైటర్ NH10, ఉడ్దా పంజాబ్) తదితరులు కీలకంగా వ్యవహరించారు. ఈ సిరీస్ వినూత్నంగా ఉందంటూ విమర్శకులు తమ రివ్యూను ఇచ్చారు.

పాతాల్ లోక్‌కు మంచి స్పందన
తాను నటించుకుండా, నిర్మాతగానే వ్యవహరించిన పాతాల్ లోక్‌కు మంచి స్పందన రావడంపై అనుష్క శర్మ రియాక్ట్ అయ్యారు. ఈ సమయంలో మంచి సక్సెస్ పార్టీ చేసుకోవాలనే ఉత్సాహం కలుగుతున్నది. కానీ ప్రస్తుత పరిస్థితులు సహకరించడం లేదు. మన సక్సెస్ పార్టీని ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసుకొందాం అని అనుష్క వర్మ తన ఇన్స్‌టాగ్రామ్‌లో రాశారు.

ఆన్‌లైన్‌లో అనుష్క సక్సెస్ పార్టీ
అనుష్క శర్మ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ సక్సెస్ పార్టీకి జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ, నీరజ్ కాబి, అనుష్క సోదరుడు కర్నేష్ తదితరులు హాజరయ్యారు. పాతాల్ లోక్ సక్సెస్ కావడంపై తమ ఆనందాన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో పంచుకొన్నారు. లాక్‌డౌన్ అనంతరం మనమంతా భారీగా పార్టీ చేసుకొందాం, ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకొందం అని అన్నారు.
Recommended Video

విరాట్‌తో కలిసి అనుష్క
లాక్‌డౌన్‌లో ఉన్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ శుక్రవారం రాత్రి పాతాల్ లోక్ సిరీస్‌ను చూస్తూ కనిపించారు. వారిద్దరూ సిరీస్‌ను చూస్తున్నఫోటోను షేర్ చేశారు. వాళ్ల టీవీ కింద వారి పెళ్లి ఫోటోను పెట్టుకోవడం ఆసక్తిని కలిగించింది. ఇక వెబ్ సిరీస్ విజయం ఇచ్చిన జోష్‌తో అనుష్క శర్మ కొత్త ప్లాన్స్ వేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











