విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ మధ్య పెరిగిన దూరం.. బాధనంతా వెల్లడిస్తూ పోస్ట్ చేసిన హీరోయిన్.!
సినీ పరిశ్రమకు.. క్రీడా రంగానికి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ క్రికెటర్లకు.. సినీ సెలెబ్రిటీలకు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈ రెండు రంగాలకు చెందిన ఎంతో మంది ప్రేమలో మునిగి తేలారు. వీరిలో చాలా మంది బంధాన్ని మధ్యలోనే ముగించేయగా.. కొందరు మాత్రమే పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. అలాంటి వారిలో విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ జోడీ ఒకటి. రెండేళ్ల క్రితం అగ్నిసాక్షిగా ఒక్కటైందీ జంట. తాజాగా అనుష్క.. కోహ్లీని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అది హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం.!

అనుష్క.. విరాట్ కలయికకు అదే కారణం
తక్కువ సమయంలో తనలోని అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమకు బౌల్డ్ అయిపోయాడు. ఓ యాడ్ కోసం కలిశారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. 2017 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది.

ఇద్దరూ ఇద్దరే.. అక్కడ బిజీ బిజీగా జంట
క్రికెట్ ద్వారా కోహ్లీ.. సినిమాల ద్వారా అనుష్క ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించారు. దీంతో ఈ జంట సోషల్ మీడియాలో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకుంటోంది.

హాలీడే ట్రిప్పులు.. ప్రేమను వెల్లడిస్తూ పోస్టులు
తరచూ ఏదో ఒక టూర్ కోసం విదేశాలకు వెళ్తున్న కోహ్లీ.. తన భార్యను సైతం వెంటబెట్టుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఆ దేశంలోని చూడదగ్గ ప్రదేశాలకు వెళ్తూ సరదా సరదాగా గడుపుతున్నారు. అలాగే, ఖాళీ సమయాల్లోనూ హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ తమ ప్రేమను వెల్లడిస్తున్నారు.
కోహ్లీకి గుడ్‌బై చెప్పలేనంటూ అనుష్క పోస్ట్
తాజాగా అనుష్క శర్మ సోషల్ మీడియాలో ‘మన ప్రియమైన వారికి గుడ్‌బై చెప్పడం చాలా సులభం అనుకుంటారు. కానీ, అలా ఎవరూ చేయలేరు' అని పోస్ట్ చేసింది. దీనికి కోహ్లీతో కలిసి ఉన్న ఫొటోను యాడ్ చేసింది. ప్రస్తుతం కోహ్లీ న్యూజిలాండ్ టూర్‌లో ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో ఆ జట్టుతో మొదటి టెస్ట్ మొదలవుతుంది. దీంతో ఈ జంట దూరంగా ఉండాల్సి వచ్చింది.
Recommended Video


మహిళా క్రికెట్ జట్టులోకి అనుష్క
ఇటీవల ‘జీరో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క శర్మ. షారూఖ్, కత్రినాతో కలిసి ఆమె నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఇక, తాజాగా ఆమె ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో నటించనుంది. ఈ పాత్ర కోసం అనుష్క క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటోంది.


Click it and Unblock the Notifications











