Virushka: ఒక్క సోషల్ మీడియా పోస్టు.. జెట్ స్పీడ్ లో 100కోట్లు.. షాక్ ఇస్తున్న అనుష్క భర్త
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనుష్క శర్మ ప్రస్తుతం గతంలో మాదిరిగా సినిమాలు చేయక పోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పేరు తో పాటు ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇటీవల విరాట్ కోహ్లీ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విరాట్ కోహ్లీ అందుకుంటున్న ఆదాయం గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే..

భారీ ఫ్యాన్ ఫాలోవర్స్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో కనబడుతూనే ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా తన భార్య అనుష్క శర్మ కూడా అ ఇన్‌స్టాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంటుంది. వీరిద్దరూ కూడా ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.

పెళ్లి తరువాత కూడా
అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఐదేళ్ల డేటింగ్ అనంతరం 2017 లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి ఇబ్బంది లేకుండా సంప్రదాయాల ప్రకారం ఏడు అడుగులు వేశారు. పెళ్లి అనంతరం కూడా ఈ స్టార్ సెలబ్రెటీలు వారి కెరీర్ ను యధావిధిగా కొనసాగిస్తునే మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక విధంగా చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.

వమికా కోహ్లీ..
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇద్దరు కూడా మొదట కొన్ని యాడ్స్ ద్వారా కలిసి నటించడంతో క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు ప్రేమ ప్రయాణం లో మునిగితేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పట్లో వీరి గురించి ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక పెళ్లి అనంతరం గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వీరి కూతురికి వమికా కోహ్లీ అని పేరు కూడా పెట్టారు.

కూతురి కోసం కోట్లల్లో ఖర్చు..
కూతురు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ కు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా సెక్యూరిటీ ఉండేలా బాడీ గార్డ్స్ ను ఏర్పాటు చేశారు. దాదాపు కూతురి సెక్యూరిటీ కోసమే విరాట్ కోహ్లీ కోట్లల్లో ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

ఒక్క పోస్టుకు 5కోట్లు..
ప్రపంచంలోనే అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీలలో విరాట్ కోహ్లీ కూడా టాప్ లిస్టులో ఉన్నాడు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 178మిలియన్స్ కు పెరిగింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో విరాట్ బ్రాండ్‌కు సంబంధించి చేసే ప్రతి పోస్ట్ ద్వారా అతనికి భారీగా ఆదాయం వస్తుంది ఫోర్బ్స్‌లోని ఇటీవలి నివేదిక ప్రకారం.. విరాట్ ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కు అత్యధికంగా 5 కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం.

100కోట్లు రావాలంటే..
కేవలం ఇన్‌స్టాలో మాత్రమే కాదు, అతను తన ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్ పేజీలలో అంశాలను పోస్ట్ చేయడానికి రకరకాల ధరలు ఉంటాయి. అతను తలచుకుంటే 100కోట్ల ఆదాయం అందుకోవడం కోసం ఎక్కువ సమయం పట్టదు. ఒక 20కి పైగా బ్రాండ్ పోస్టులు చేసినా సరిపోతుంది. కేవలం సోషల్ మీడియా ద్వారా దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సెలబ్రేటీగా కోహ్లీ నిలిచాడు.


Click it and Unblock the Notifications











