భర్త విరాట్ కోహ్లీ చేతిలో ఓడిన అనుష్క శర్మ.. లాక్‌డౌన్‌లో చిలిపి ఆటలు..
కరోనా లాక్‌డౌన్ కారణంగా భర్త విరాట్ కోహ్లీతో స్వీయ గృహనిర్బంధంలో ఉంటున్న బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం భర్త విరాట్ కోహ్లిని ఆటపట్టిస్తూ.. ఏయ్ కోహ్లీ.. చౌకా మార్.. చౌకా అంటూ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఇలా చిలిపి పనులతో కాలక్షేపం చేస్తున్న అనుష్క తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో గిబ్బరిష్ ఫిల్టర్ అనే గేమ్‌లో కొని పదాలను, వ్యాఖ్యలను గుర్తించడం విఫలమైంది. అయితే ఆ పదాలను చూడకుండానే విరాట్ కోహ్లి సరిగ్గా గుర్తించడం గమనార్హం.
తాజాగా గిబ్బరిష్ ఆటకు సంబంధించిన వీడియోను అనుష్క షేర్ చేసింది. stir range earth inks, Stranger Things అనే వాటిని చూడకుండా సరిగా గుర్తించలేకపోయింది. Stranger Things అనే దానికి విరాట్ సరిగ్గా చెప్పడం గమనార్హం. ఈ సరదా ఆటలో గెలవలేకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. తానోక పనికిరాని అమ్మాయిని (బేవకూఫ్ లడ్కి) అని తనకు తాను తిట్టుకొంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను పెట్టారు.

తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ కంపెనీలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందించిన వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆవిష్కరించారు. ఈ సిరీస్‌లో గుల్ పనాగ్, జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











