ప్రభాస్‌తో టాప్ హీరోయిన్ లింక్.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అగ్రనటి

లాక్‌డౌన్‌లో ప్రశాంత జీవితాన్ని గడిపిన యంగ్ రెబల్ స్టార్ రానున్న రెండేళ్లకు సరిపడా భారీ ప్రాజెక్టులను సెట్ చేసుకొన్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ రెండు ప్యాన్ ఇండియాను మించిన సినిమాలకు ఒకే చెప్పడం భారతీయ సినిమా పరిశ్రమలో ఓ సంచలనం రేపింది. ఇప్పటికే బాహుబలితో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకొన్న ప్రభాస్ ఇక ముందు కూడా సెన్సేషనల్ కథలతో ప్రభాస్ వస్తుండటం విశేషం. ఇక ప్రభాస్‌తో ప్రముఖ హీరోయిన్ నటిస్తున్నారనే వార్తలపై చిత్ర యూనిట్ స్పందిస్తూ...

రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ప్రభాస్

రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ప్రభాస్

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తున్న సమయంలో ప్రభాస్ మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకొన్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆది పురుష్ చిత్రానికి, మరోటి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సైంటిఫిక్, ఫిక్షన్ మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా ఎంపిక చేయడం తెలిసిందే.

ప్రెగ్నెన్సీ సమయంలో అనుష్క శర్మనా?

ప్రెగ్నెన్సీ సమయంలో అనుష్క శర్మనా?

అయితే ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క శర్మ నటిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం అనుష్క ఉన్న పరిస్థితుల్లో నటించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వచ్చాయి. ఎందుకంటే ఇటీవలే అనుష్క శర్మ ప్రెగ్నెంట్ వార్తను భర్త విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అనుష్క శర్మ టీమ్ స్పందిస్తూ..

అనుష్క శర్మ టీమ్ స్పందిస్తూ..


ప్రభాస్‌తో ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నారనే వార్తలపై అనుష్క శర్మ పీఆర్ వర్గాలు స్పందించాయి. తాజాగా ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. అనుష్క శర్మ ప్రస్తుతం గర్బవతి. ఆ సమయంలోనే కొన్ని క్రేజీ ప్రాజెక్టులను కూడా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆది పురుష్ చిత్రంలో ఆమె నటించడం లేదు. మా మధ్య అలాంటి చర్చలు జరుగలేదు అని టీమ్ స్పష్టం చేసింది.

ఆదిపురుష్ చిత్రంలో నటించడం లేదు

ఆదిపురుష్ చిత్రంలో నటించడం లేదు

ఆదిపురుష్ సినిమా వివరాలు మా దృష్టికి వచ్చాయి. అయితే అనుష్క శర్మ అందులో నటిస్తున్నారనే వార్తలు మాత్రం అవాస్తవం. ప్రెగ్నెన్సీ కావడంతో తన సినిమాల ఎంపిక విషయంలో కచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు. ఆమె నటించబోయే సినిమాలు త్వరలోనే ప్రకటిస్తాం. కాకపోతే ఆ సినిమాలు అనుష్క కెరీర్‌లో వైవిధంగా ఉంటాయనే విషయం మాకు చాలా సంతృప్తిని కలుగుచేస్తున్నాయి. అంతకంటే తొలి సంతానం కలుగబోతుందనే వార్త మాకు మరింత సంతోషాన్ని కలుగు చేస్తున్నది అని పీఆర్ టీమ్ ప్రకటించింది.

Recommended Video

Ravana Lanka Movie Audio Launch
ఏప్రిల్ తర్వాతనే అనుష్క శర్మ షూటింగులకు

ఏప్రిల్ తర్వాతనే అనుష్క శర్మ షూటింగులకు

అనుష్క శర్మ తన డెలివరీ తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో షూటింగుకు హాజరవుతారు. డెలివరీ తర్వాత కొంత విరామం తీసుకొని శారీరకంగా పరిపుష్టిని సాధించిన తర్వాత షూటింగులకు హాజరుకావాలనుకొంటున్నారు. ఏప్రిల్ తర్వాత ఆమె సినిమాల్లో నటించే అవకాశం ఉంటుంది అని పీఆర్ వర్గాలు వెల్లడించాయి. జనవరిలో అనుష్క, విరాట్ దంపతులు తమ తొలిబిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X