తన ఖర్చు తానే భరించనున్న అనుష్క.. విరాట్ కోహ్లీకి దూరంగా, విమర్శలకు భయపడిందా!

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా ప్రేమించుకుని 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలో వాణిజ్య ప్రకటనల ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉండగా విరాట్ కోహ్లీ ఫెయిల్ అయిన ప్రతి సారి విమర్శకులకు అనుష్క టార్గెట్ గా మారేది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలో ఐసీసీ ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో అనుష్క శర్మ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

త్వరలో ప్రపంచకప్

త్వరలో ప్రపంచకప్

చాలా సందర్భాల్లో విరాట్ కోహ్లీ ఆడుతుండగా అనుష్క స్టాండ్స్ లో చేరి తన భర్త ఆటని చూడడం గమనించాం. అలాగే విరాట్ కోహ్లీ కూడా అనుష్క నటించే చిత్రాలని చూస్తూ ఆమెని కెరీర్ పరంగా ప్రోత్సహించేవాడు. త్వరలో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అనుష్క గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అనుష్క కూడా ఇంగ్లాండ్ కు వెళ్లి ప్రపంచకప్ మ్యాచ్లు ఆస్వాదించనున్నట్లు తెలుస్తోంది.

కోహ్లీకి దూరంగా

కోహ్లీకి దూరంగా

కానీ ప్రపంచ కప్ జరిగినన్ని రోజులు అనుష్క విరాట్ కోహ్లీకి దూరంగా ఉంటుందట. ఇంగ్లాండ్ లో తన ఖర్చులు మొత్తం తానే భరించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ జరిగినన్ని రోజులు విరాట్ ఆటపై దృష్టిపెట్టేలా అనుష్క ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం అనుష్క ఇంగ్లాండ్ లో ఓ కారుని కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

విమర్శలకు భయపడి

విమర్శలకు భయపడి

2015 ప్రపంచ కప్ సందర్భంగా అటు విరాట్ కోహ్లీపై, ఇటు అనుష్కపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అనుష్క వలనే విరాట్ కోహ్లీ ఏకాగ్రతతో ఆడలేకపోయాడని విమర్శించారు. 2015 ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఒక్క మ్యాచ్ ఆడనందుకే నాతోపాటు అనుష్కని కూడా విమర్శిస్తారా అని విరాట్ అప్పట్లో మండిపడ్డాడు. విమర్శకులకు అలాంటి అవకాశం ఇవ్వకుండా అనుష్క ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జీరో చిత్రంతో

జీరో చిత్రంతో

అనుష్క చివరగా నటించిన చిత్రం జీరో. షారుఖ్ ఖాన్ సరసన నటించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. అంతకు ముందు సంజు, సూయి ధాగా లాంటి చిత్రాలతో అనుష్క విజయాలు అందుకుంది. అనుష్క తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X