అది నా వ్యక్తిగతం.. మీకెందుకు అంత ఉబలాటం? అందుకే సినీ ఇండస్ట్రీకి వచ్చా.. అనుష్క ఫైర్

బాలీవుడ్ నటి, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. ఎప్పటినుంచో ఆమెను పిల్లల విషయంలో ప్రశ్నలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికర సమాధానం చెప్పింది ఈ బ్యూటీ. వివరాల్లోకి పోతే..

 అనుష్క శర్మ కొత్త అవతారం.. త్వరలోనే

అనుష్క శర్మ కొత్త అవతారం.. త్వరలోనే

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది అనుష్క శర్మ. విలక్షమైన పాత్రల్లో నటిస్తూ బీ టౌన్ ప్రేక్షకులను అలరిస్తోంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొన్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా ఆమెలోని హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని తాజా ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న అనుష్క.. త్వరలో నిర్మాత అవతారమెత్తనుందని సమాచారం.

ప్రేమించి పెళ్లాడిన అనుష్క.. ఈ మధ్యకాలంలో

ప్రేమించి పెళ్లాడిన అనుష్క.. ఈ మధ్యకాలంలో

ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడిన అనుష్క శర్మ.. తన జీవితాన్ని భర్తతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తోంది. కొన్నిరోజులుగా సినిమాలు పక్కనపెట్టేసి మరీ షికార్లు కొడుతోంది. దీంతో పిల్లల్ని కనేందుకే అనుష్క సినిమాలను పక్కన పెట్టేసిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై పలుసార్లు అనుష్క స్పందిస్తూ అలాంటిది లేదని స్పష్టం చేసింది.

పదేపదే అదే ప్రశ్న.. ఫైర్ అయిన అనుష్క

పదేపదే అదే ప్రశ్న.. ఫైర్ అయిన అనుష్క

అయినప్పటికీ ఆమెను అదే ప్రశ్న పదేపదే వెంటాడుతోంది. అనుష్క శర్మకు చిర్రెత్తుకొచ్చి అగ్గిమీద గుల్లలం అయ్యింది. తాను డబ్బు సంపాదన కోసం సినిమాల్లోకి రాలేదని, తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. అందుకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పింది. తల్లిని కావడానికే విరామం తీసుకున్నానని.. చాలా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదని చెబుతూ ఫైర్ అయింది అనుష్క.

నా వ్యక్తిగతం.. మీకెందుకు అంత ఉబలాటం?

నా వ్యక్తిగతం.. మీకెందుకు అంత ఉబలాటం?

''సినిమాల్లో నటిస్తూ కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. అయినా కూడా నేను పిల్లల్ని కనేందుకు ఇంకా సమయముంది. పిల్లల్ని ఎప్పుడు కణాలనేది నా వ్యక్తిగత విషయం మీకెందుకు అంత ఉబలాటం'' అంటూ ఘాటుగా రియాక్ట్ అనుష్క శర్మ.

అనుష్క ఛాలెంజ్..

అనుష్క ఛాలెంజ్..

ఇకపోతే దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా హోమ్ క్వారంటైన్ లోనే ఉండి అనుష్క శర్మ. భర్త విరాట్ కోహ్లీతో కలిసి సరదాగా సమయం గడిపేస్తోంది. అంతేకాదు రోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సు మేర సరికొత్త ఆలోచన చేసిన ఆమె.. ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్' కూడా విసిరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X