అనుష్క శర్మ మెడకు కులం ఉచ్చు..లీగల్ నోటీసులతో సెలబ్రేషన్స్ బ్రేక్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు మొదటి వెబ్ సిరీస్ ద్వారా కొత్త సమస్యలు తలెత్తాయి. ఇటీవల ఆమె పాతాల్ లోక్ అనే వెబ్ సిరిస్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వివాదాలకు దూరంగా ఉండే అనుష్కకు ఈ సిరీస్ ద్వారా నోటీసులు కూడా అందడంతో బాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఓ వర్గానికి చెందిన కులాన్ని తక్కువగా చేసి చూపించారని అనుష్కపై విమర్శలు వస్తున్నాయి.

అనుష్క శర్మ ఫస్ట్ వెబ్ సిరీస్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మ మొట్ట మొదటి సారి నిర్మాతగా వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టింది. ఒక పోలీసు అధికారి ఉన్నతస్థాయి కేసు దర్యాప్తు అనుకోని విదంగా అండర్ వరల్డ్ యొక్క చీకటి రాజ్యంలోకి ఎలా తీసుకువెళుతుంది అనే కోణంలో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ లో ఇటీవల రిలీజ్ చేశారు.

అనుష్కకు నోటీసులు..
గోర్ఖా అనే పదాన్ని కించపరిచేలా మాట్లాడటం చట్ట ప్రకారం కులదూషనే అని ప్రణయ్ రాయ్ & అసోసియేట్స్ కి చెందిన విరేన్ శ్రీ గురుంగ్ అనుష్కకు నోటీసులు పంపారు. కోవిడ్ 19 సంక్షోభంలో ఫ్రీగా లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి గిల్డ్ లా ప్రకారం ఏర్పాటు అయ్యారు. మే 18న టెలికాస్ట్ అయిన పాతాల్ లోక్ కులాన్ని ప్రస్తావిస్తూ దూషణ చేశారని నోటీసులో పేర్కొన్నారు.

తప్పుగా చూపించారు
నేపాలికి సంబంధించిన కమ్యూనిటీని అవమానిస్తున్నట్లుగా ఉందని ముఖ్యంగా సెకండ్ ఎపిసోడ్స్ లో అభ్యంతర సన్నివేశాలు ఎక్కువగా చిత్రీకరించినట్లు గురుంగ్ ఆరోపించారు. ఒక పోలీసు పాత్ర నేపాలీ పాత్రను గోర్ఖ అంటూ తప్పుగా చూపించారని ఇప్పటికే నిర్మాతల్లో ఒకరైన అనుష్క శర్మకు నోటీసులు పంపినట్లు తెలియజేశారు.
Recommended Video

వెంటనే తొలగించాలి
ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతున్న సమయంలో గోర్ఖా కమ్యూనిటీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అఫీషియల్ ట్విట్టర్ ద్వారా స్పందించిన వారు.. పదాన్ని తొలగించి తీరాలని సోమవారం యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్ట్రీకు ఆన్ లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు.


Click it and Unblock the Notifications











