పెళ్లి కోసం అబద్దం చెప్పిన అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్పిందంటే!

Recommended Video

Anushka Sharma Reveals Virat Kohli's Fake Name That She Used To Tell The Caterer | Filmibeat Telugu

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా ప్రేమించుకుని 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలో వాణిజ్య ప్రకటనల ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. విరాట్, అనుష్క చాలా కాలం పాటు ప్రేమికులుగా చేట్టాపట్టాలేసుకుని తిరిగారు. 2017లో వీరిద్దరి వివాహం ఇటలీలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య జరిగింది. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా విరాట్, అనుష్క వివాహం చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

అలా ఇష్టం లేదు

అలా ఇష్టం లేదు

నాకు, విరాట్ కోహ్లీకి పెద్ద సెలెబ్రిటీల తరహాలో వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని అనుష్క ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తెలిపింది. పెళ్లి ఇటలీలో జరిగింది. దీనితో మీడియా తాకిడి లేదు. అది కేవలం కోహ్లీ, అనుష్క వివాహం లగా మాత్రమే జరగాలి. క్రికెటర్ కోహ్లీ, నటి అనుష్క వివాహంలా జరగకూడదు అని తాము నిర్ణయించుకున్నట్లు అనుష్క తెలిపింది. అందుకోసం తామిద్దరం ఓ అబద్దం చెప్పామని తెలిపింది.

పేరు మార్చేశారు

పేరు మార్చేశారు

అనుష్క పేరు ఇటలీ లాంటి దేశాల్లో ఎవరికీ తెలియదు. ఆమె ఇండియాలో మాత్రమే పాపులర్ అయిన నటి. ఇక కోహ్లీ స్పోర్ట్స్ స్టార్. విరాట్ కోహ్లీ పేరు ప్రపంచం నలుమూలల క్రికెట్ ఇష్టపడే వారందరికీ తెలిసే ఉంటుంది. దీనితో వివాహ వేడుకలో కనీసం క్యాటరింగ్ వాళ్లకు కూడా కోహ్లీ అసలు పేరు చెప్పలేదు. కోహ్లీ పేరు రాహుల్ అని మార్చి అబద్దం చెప్పినట్లు అనుష్క శర్మ గుర్తుచేసుకుంది.

42మంది మావాళ్లే

42మంది మావాళ్లే

మా పెళ్ళికి 42మంది అతిథులు హాజరయ్యారు. వారంతా మా కుటుంబ సభ్యులు, స్నేహితులే అని అనుష్క తెలిపింది. ఇటలీలోని ట్యూస్కాని వ్యాలీలో అనుష్క, కోహ్లీ వివాహం జరిగింది. కోహ్లీతో వివాహం తర్వాత కూడా అనుష్క నటన కొనసాగిస్తోంది. అనుష్క చివరగా షారుఖ్ సరసన జీరో చిత్రంలో నటించింది.

భర్త వెంటే

భర్త వెంటే

ప్రేమ మొదలైనప్పటి నుంచి కోహ్లీ ఆడే ప్రతి మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూడడానికి ప్రయత్నిస్తూ అనుష్క స్టేడియంలో సందడి చేయడం చూస్తోనే ఉన్నాం. ఇప్పటికి అనుష్క స్టేడియంలోని మ్యాచ్ లు చూడడానికి ఇష్టపడుతోంది. కోహ్లీ బౌండరీల మోతమోగిస్తుంటే స్టాండ్స్ లో నిలబడి అనుష్క కేరింతలు కొట్టడం చూస్తూనే ఉన్నాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X