మాజీ ప్రియుడి విషయంలో నిందలు.. బ్లాస్ట్ అయిన అనుష్క శర్మ.. చివరకు చెప్పక తప్పలేదు
బాలీవుడ్ నటి, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి బ్లాస్ట్ అయింది. గత కొంతకాలంగా తనపై వస్తున్న రూమర్లపై స్పందిస్తూ ఫైర్ అయింది. ఇంతకాలం మౌనంగా ఉన్న తనను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని పేర్కొంటూ విరుచుకు పడింది. దీంతో ఈ ఇష్యూ సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అనుష్క శర్మపై ఎందుకిలా ఫైర్ కావాల్సి వచ్చింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

టీమిండియా సెలక్టర్స్.. క్రికెట్ వ్యవహారాలు
గత వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో టీమిండియా సెలక్టర్స్ టీం చేత స్పెషల్‌గా సర్వ్ చేయించుకుందని అనుష్క శర్మపై భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. పైగా అనుష్క శర్మ క్రికెట్‌కు సంబంధించిన మీటింగ్స్‌లో తలదూరుస్తున్నానని, దాని వల్ల సెలక్షన్ ప్రాసెస్‌పై ఎఫెక్ట్ పడిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయమై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది అనుష్క.

రూమర్స్ పుట్టిస్తున్నారు.. అనుష్క మండిపాటు
తనపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆ క్రికెటర్ చేసిన వ్యాఖ్యల్లో అర్థం పర్థం లేదని, దాన్ని పట్టుకొని తెగ రూమర్స్ పుట్టిస్తున్నారని ఫైర్ అయింది. మొదట ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకూడదని అనుకున్నానని, కానీ.. పదే పదే అవే రూమర్స్ వస్తే ఆ వార్తలు నిజమయ్యే ప్రమాదం ఉందని తెలుపుతూ అందుకే ఇలా స్పందించాల్సి వస్తోందని ఆమె చెప్పింది.

నా మాజీ ప్రియుడి విషయంలోనూ.. ఆగ్రహం తట్టుకోలేక
ఒకప్పుడు నా మాజీ ప్రియుడు రణ్‌వీర్ సింగ్ విషయంలోనూ నా పైనే నిందలు వేశారని, అయినప్పటికీ తాను మౌనంగానే ఉన్నానని తెలుపుతూ బ్లాస్ట్ అయింది అనుష్క. ఇక ఇలాంటి నిందలు భరించడం తన వల్ల కాదని, ఇంకెప్పుడూ అనవసరంగా తనపై వివాదాస్పద రూమర్స్ పుట్టించవద్దని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అనుష్క శర్మ.

అనుష్క రియాక్షన్.. రణ్‌వీర్ సింగ్ ఎంటర్
అనుష్క రియాక్షన్ చూసి ఫరూఖ్ ఆమెకు వెంటనే సారీ చెప్పారు. తాను జోక్‌గా అంటే దాన్ని పెద్దది చేశారని, అనవసరంగా అనుష్కను ఈ విషయంలోకి లాగి నానా రచ్చ చేశారని పేర్కొంటూ.. ఆమె మంచి యువతి అని తెలుపుతూ ట్వీట్ చేశారు. మరోవైపు అనుష్క రియాక్షన్ చూసి మాజీ ప్రియుడు రణ్‌వీర్ సింగ్ కూడా స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలబడటం విశేషం.

త్వరలో అనుష్క శర్మ కొత్త అవతారం
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది అనుష్క శర్మ. విలక్షమైన పాత్రల్లో నటిస్తూ బీ టౌన్ ప్రేక్షకులను అలరిస్తోంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొన్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా ఆమెలోని హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని తాజా ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న ఈమె త్వరలో నిర్మాత అవతారమెత్తనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











