Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుష్క శర్మ, ధోనీ భార్య క్లాస్ మేట్స్... వైరల్ అవుతున్న ఫోటోస్
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, సాక్షి ధోనీ... ఇద్దరూ ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్లను పెళ్లాడారు. వీరి మధ్య ఉన్న కామన్ పాయింట్ కేవలం ఇది మాత్రమే కాదు.. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అనుష్క, సాక్షి చిన్నతనంలో క్లాస్ మేట్స్ కూడా.
అనుష్క తండ్రి.. రిటైర్డ్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ ఇండియన్ ఆర్మీలో పనిచేసిన సంగతి తెలిసిందే. అనుష్క చిన్నతనంలో వృత్తి రీత్యా వారి కుటుంబం దేశంలోని వివిధ ప్రదేశాల్లో నివసించాల్సి వచ్చింది. ఓసారి ఆయనకు అస్సాంలో పోస్టింగ్ వచ్చినపుడు... మార్గరీటా అనే టౌన్‌లోని సేయింట్ మేరీస్ స్కూల్లో అనుష్కను చేర్పించారు. ఇదే స్కూల్లో సాక్షి కూడా చదువుకున్నారు.
అనుష్క, సాక్షి చిన్ననాటి ఫోటో
సోషల్ మీడిమాలో ఈ విషయం ఇపుడు వైరల్ అయింది. స్కూల్ ఫంక్షన్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోస్ సైతం వెబ్‌లో సర్య్కేలేట్ అవుతున్నాయి. ఈ ఫోటోలో అనుష్క పింక్ గాగ్రా ఛోళి వేసుకోగా, సాక్షి ఫెయిరీ డ్రెస్సులో కనిపించింది.
మేము కలిసి జీవించాం
గతంలో ఓ ఫంక్షన్లో కూడా అనుష్క ఈ విషయం వెల్లడించారు. స్కూల్ నుంచి విడిపోయిన చాలా ఏళ్ల తర్వాత తాము మళ్లీ కలిశాం, ఒకప్పుడు మేము అస్సాంలోని ఒక చిన్నపట్టణంలో కలిసి జీవించామని వెల్లడించారు.
ఫోటోస్ చూసే వరకు...
అయితే ఎప్పుడో ఊహ తెలియని వయసులో కలిసి చదువుకోవడంతో ఇద్దరికీ ఆ విషయం గుర్తు లేదు. అయితే అనుకోకుండా తమ చిన్ననాటి ఫోటోస్ దొరకడంతో ఈ విషయం బయటకు వచ్చింది. చిన్నపుడు కలిసి చదువుకున్న వీరు ఒకే రంగానికి చెందిన వ్యక్తులను పెళ్లాడటం కాకతాళీయమే.
అనుష్క శర్మ
అనుష్క శర్మ సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘జీరో' చిత్రం డిసెంబర్లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె వికలాంగురాలైన సైంటిస్టు పాత్రలో నటించింది. షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.