ఏనుగు హత్య మరవకముందే మరో జంతువుపై పైశాచికం.. వాళ్లు మనుషులేనా.. అనుష్క శర్మ ఫైర్
కేరళలో ఏనుగును టపాసులు పెట్టి చంపిన ఘటన మరవకముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. ఓ తోడేలును అతి కిరాతకంగా చంపడం తమిళనాడులో సంచలనం రేపింది. జంతువులపై హింస్మాత్మకంగా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ ఘటనపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంలో పైశాచికంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో దారుణంగా
తమిళనాడులో జరిగిన తోడేలు హత్యపై అనుష్కశర్మ తీవ్రంగా స్పందించడం చర్చనీయాంశమైంది. తిరుచికి సమీపంలో మాంసం ముద్దలలో బాంబు పెట్టి తోడేలును అతి కిరాతకంగా చంపడం స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. మూగ జీవాలపై అలా పైశాచికత్వం చేయడం సరికాదు అని జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రూరంగా జంతువులను చంపుతున్న వారిపై కఠిన శిక్ష విధించాలని పలువురితోపాటు అనుష్క శర్మ కూడా డిమాండ్ చేశారు.

ఈ ట్రెండ్ ఎక్కడికి అంటూ
జంతువుల కిరాతకంగా చంపుతూ సమాజానికి ఏం చెప్పాలనుకొంటున్నారు. ఇలాంటి దారుణమైన ట్రెండ్‌తో ఎక్కడికి వెళ్తున్నాం. జంతువుల హత్య విషయంలో నిందితులకు కఠిన శిక్ష విధించేలా చట్టాలు చేయాలి అంటూ అనుష్క శర్మ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై తన ఆవేదన వ్యక్తం చేశారు.

మాంసం ముద్దలో బాంబులు
తోడేలు హత్యపై పోలీసులు వివరణ ఇస్తూ.. మాంసం ముద్దలో పేలుడు పదార్థాలు పెట్టారు. తోడేలు నోట్లో పెట్టుకొని కొరకగానే పేలడంతో జంతువు మరణించింది. ఈ ఘటన తిర్చి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో 12 మందిని తమిళనాడు అటవీశాఖ అరెస్ట్ చేసింది. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు అని తెలిపారు.
Recommended Video

కేరళలో ఏనుగు, హిమాచల్ ప్రదేశ్‌లో ఆవు
ఇటీవల కాలంలో కేరళలో గర్భణి ఏనుగును పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టి హత్య చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అన్ని భాషల సినీ ప్రముఖులు తీవ్రంగా నిరసన తెలపడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో కొందరు గర్భంతో ఉన్న ఆవును చంపడానికి ప్రయత్నించిన ఘటన అందర్నీ కలిచివేసింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











