కూతురు వమికాతో విరాట్ కోహ్లి.. అనుష్క శర్మ షేర్ చేసిన ఫోటో వైరల్
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతుల కుమార్తె వమిక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుమార్తెతో కలిసి కోహ్లి, అనుష్క ముద్దుచేస్తూ ఆడుకొంటున్న ఫోటో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అయితే వమికా 2021, జనవరి 11 రోజున వమికా జన్మించిన తర్వాత తమ కుమార్తె పబ్లిక్ కనిపించకుండా దూరంగా ఉంచారు. అయితే ఇటీవల ఆమె ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు ఆనందానికి గురిచేస్తున్నారు.
కొద్దికాలంగా విరాట్ కోహ్లి యూకేలో టెస్ట్ సిరీస్ కోసం బిజీగా ఉండగా అనుష్క శర్మ తన కుమార్తెతో కలిసి సమయాన్ని గడిపారు. ఆ తర్వాత కోహ్లి టీ20 వరల్డ్ కప్ మ్యాచుల కోసం దుబాయ్ వెళ్లగా ఆమె అక్కడికి కూడా వెళ్లారు. అయితే పలు దేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో విరాట్ కోహ్లీ తన కూతురు వమికాకు దూరంగా ఉన్నారు. వమికాను దూరంగా చూస్తూనే జీవితాన్ని గడిపారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్వారంటైన్ లైఫ్ ముగియడంతో భార్య, కూతురుతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సోమవారం రోజున అనుష్క శర్మ ఓ ఫోటోను షేర్ చేశారు. వమికాతో విరాట్ ఆడుకొంటున్న ఫోటోను పోస్టు చేసి.. నా హృదయం మొత్తం ఒకే ఫ్రేమ్‌లో బంధించబడి ఉంది అంటూ అనుష్క మెసేజ్ పెట్టారు. ప్లే స్టేషన్‌లో వమికా ఆడుకొంటుండగా. విరాట్ కోహ్లీ నవ్వుతూ కూతురును ఆడిస్తూ కనిపించారు.

అయితే ఈ ఫోటోలో కూడా వమికా ముఖం కనిపించకుండా అనుష్క శర్మ జాగ్రత్తగా ఫోటో తీసింది. వమిక వెనుక నుంచి ఫోటో తీయగా.. ఆమె ముందు విరాట్ కోహ్లీ నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.
ఇక అనుష్క శర్మ కెరీర్ విషయానికి వస్తే.. 2018లో షారుక్ ఖాన్‌తో జీరో సినిమా చేసిన తర్వాత ఏ చిత్రంలోను నటించలేదు. గర్బవతిగా మారిన తర్వాత సినిమాలకు దూరమైనా.. ఆమె నిర్మాతగా సినీ రంగంతో భాగస్వామ్యం అయ్యారు. నిర్మాతగా పాతాల్ లోక్, బుల్‌బుల్ చిత్రాలను నిర్మించారు. ఓటీటీలో ఆ రెండు వెబ్ సిరీస్‌లు కూడా మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఇక హీరోయిన్‌గా ఇంకా సినిమాలను అంగీకరించలేదు. మా, కాలా అనే చిత్రాలను నిర్మించింది. అవి త్వరలోనే విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











