ఇంతకంటే గొప్ప ఫీలింగ్ ఎక్కడైనా ఉంటుందా?.. గర్భాన్ని చూసి మురిసిపోతోన్న అనుష్క!!

విరుష్క జంట ప్రస్తుతం ఎంతో ఆనందంగా ఉంది. వారింట్లో నూతన తరం రాబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట ఐపీఎల్ కోసం దుబాయ్‌లో ఉంది. గర్భంతో ఉన్న శ్రీమతిని సంతోషంగా ఉంచేందుకు విరాట్ కోహ్లీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐపీఎల్ అంటూ బిజీగా గడుపుతున్నా కూడా భార్యను వీకెండ్‌లో బాగానే తిప్పుతున్నాడు. తాజాగా అనుష్క శర్మ ఓ అద్భుతమైన ఫోటోను షేర్ చేసింది. అంతకంటే అద్భుతంగా మాతృతం గురించి వివరించింది.

 చూడముచ్చని జంట..

చూడముచ్చని జంట..

విరాట్ కోహ్లీ అనుష్క జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. విరుష్క జంటకు కేవలం బాలీవుడ్‌లోనే కాదు ప్రతీ చోటా క్రేజ్ ఉంటుంది. ప్రేమ, డేటింగ్, పెళ్లి ఇలా ప్రతీ విషయంలో విరుష్క జోడీ హాట్ టాపిక్. ఇక వీరిద్దరు కలిసి నటించారంటే అది వేరే లెవెల్‌లోనే ఉంటుంది. వాణిజ్య ప్రకటనల కోసం వీరిద్దరు చేసే రొమాన్స్ ఓ రేంజ్‌లో వర్కవుట్ అవుతూ ఉంటుంది.

యాడ్‌లకు విరుష్క ఫేమస్..

యాడ్‌లకు విరుష్క ఫేమస్..

వివాహా బంధం, ఆలుమగల అనుబంధం గురించి వివరిస్తూ వీరు చేసిన యాడ్ అప్పట్లో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి రొమాన్స్, సరసాలకు, సరదాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కమర్షియల్ యాడ్స్‌లో ఈ జోడిది ప్రత్యేకస్థానం. ఇక ఈ ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యే సమయం రానుంది.

ఇప్పుడు ఇద్దరమే కానీ..

ఇప్పుడు ఇద్దరమే కానీ..

లాక్‌డౌన్ సమయంలో విరుష్కకు కాసింత ఏకాంత సమయం లభించింది. లేదంటే అనుష్క షూటింగ్‌లతో, విరాట్ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉండేవారు. ఈ లాక్ డౌన్ వీరికి ఇలా కలిసి వచ్చింది. ఇద్దరిగా ఉన్న వీరి మధ్యలోకి ఓ పండంటి బిడ్డ రాబోతోంది. ఈ విషయాన్ని అనుష్క, విరాట్ కలిసి ప్రకటించడం, ఆ రోజు షేర్ చేసిన ఫోటో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

Recommended Video

Virat Kohli Is To Become Father,Shares First Baby Bump Pic Of Anushka Sharma || Oneindia Telugu
గర్భాన్ని చూస్తూ..

గర్భాన్ని చూస్తూ..

తాజాగా అనుష్క తన గర్భాన్ని చూస్తూ మురిసిపోయింది అనుష్క. ఇంతకంటే నిజమైంది..ఒకరికి జీవితాన్ని ఇవ్వడమనే గొప్ప అనుభవం మరొకటి ఉండదు.. ఒకవేళ ఇది మన చేతుల్లో లేకపోతే ఎలా? అంటూ మాతృత్వపు గొప్పదనాన్ని చాటి చెప్పింది. ఇక శ్రీమతి చేసిన పోస్ట్‌కు విరాట్ సమాధానమిచ్చాడు. నా సర్వస్వం, నా ప్రపంచం మొత్తం ఒకే ఫోటోలో ఉంది అని అన్నాడు. పరోక్షంగా తన భార్య, బిడ్డలే తనకు ప్రపంచం అని చాటిచెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X