విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)
బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమికుల దినోత్సవాన్ని తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి విభిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇద్దరూ ప్రస్తుతం కోహ్లి స్వస్థలం అయిన న్యూ ఢిల్లీలో గడుపుతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విరాట్‌తో కలిసి దిగిన ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను విష్ చేశారు.
'నేను నా వాలంటైన్‌తో కలిసి నిన్నరాత్రి డిన్నర్ చేయడానికి వెళ్లాను. ఇక్కడ ఎంతో రుచికరమైన ఫుడ్ ఆస్వాదించాం' అంటూ న్యూఢిల్లీలోని ఓ పోష్ రెస్టారెంటులో దిగిన ఫోటో అనుష్క షేర్ చేశారు.

అనుష్క-విరాట్ రేర్ ఫోటో
సౌత్ అమెరికాలోని అల్పాకాస్ అనే జంతువులతో కలిసి దిగిన ఫోటోలను అనుష్క శర్మ ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అనుష్క ‘లవ్' గురించి ఎంతో గొప్పగా వర్ణించిన తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

రెస్టారెంటులో సందడి చేసిన విరాట్, అనుష్క
బుధవారం రాత్రి నుంచే అనుష్క, విరాట్ వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. న్యూ ఢిల్లీలోని ఓ ఫేమస్ రెస్టారెంటులో సెల్రబిటీ కపుల్ సందడి చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

బిజీగా గడుపుతూనే..
అనుష్క శర్మ, విరాట్ కోహ్లి పెళ్లి తర్వాత ఎవరి ప్రొఫెషన్లో వారు బిజీగా ఉంటూనే... ఉన్న సమయాన్ని ఇద్దరూ కలిసి గడిపేలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. క్రికెట్ టూర్లతో కోహ్లి విదేశాలకు వెళ్లినపుడు అనుష్క సైతం తన బిజీ సినీ షెడ్యూల్‌కు బ్రేక్ ఇస్తూ కోహ్లి ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు.

అనుష్క శర్మ
అనుష్క శర్మ సినిమాల విషయానికొస్తే... ఆమె చివరగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో' చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైనప సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఇంకా ఏ మూవీకి కమిట్ కాలేదు.


Click it and Unblock the Notifications











