దీపావళి వెలుగుల్లో విరుష్క.. అదుర్స్ అనిపిస్తున్న అమ్మడి హాట్‌నెస్
దీపావళి పండగను ఘనంగా దేశమంతా ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఆదివారం దీపావళి సంబరాల్లో మునిగితేలారు. పలువురు సెలెబ్రిటీలు దీపావళి వేడుకలను ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, తన భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి పండగ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దివాళీ సంబరాలు.. టాప్ సెలెబ్రిటీస్ కావడంతో
దీపావళి సంబరాల్లో భాగంగా ముంబైలోని తమ నివాసాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసుకున్నారు విరాట్- అనుష్క జోడీ. ఇంటి నిండా దీపాలతో అలంకరించి దివాళీ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్బంగా అనుష్కతో కలిసి పండగను ఎంజాయ్ చేసిన పిక్స్ అభిమానులతో పంచుకున్నారు కోహ్లీ. ఇద్దరూ టాప్ సెలెబ్రిటీస్ కావడంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

సంప్రదాయం ఉట్టిపడేలా లుక్
దీపావళి వేళ కోహ్లీ ఇంట్ల సందడి వాతావరణం కనిపించింది. తెలుపు రంగు దుస్తుల్లో కోహ్లీ, లెహెంగాలో అనుష్క సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించారు. దీంతో ఈ ఫొటోలు చూసి మురిసిపోతున్నారు వారువురి అభిమానులు. ఈ సందర్బంగా కోహ్లీ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వెలుగును ఎల్లప్పుడూ ఇలాగే
'మీకు, మీ కుటుంబానికి మా దీపావళి శుభాకాంక్షలు. ఈ వెలుగులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను' అని కోహ్లీ పేర్కొన్నారు. 'హోమ్-స్వీట్ హోమ్' అని ట్యాగ్ చేస్తూ ఫోటో షేర్ చేశారు. మరోవైపు అనుష్క శర్మ కూడా తన ట్వీటర్ ఖాతాలో మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సూపర్ జోడి అంటూ కామెంట్స్
అభిమానులు ఈ ఫొటోలపై కామెంట్ల వర్షం కురుస్తూ.. వారిరువురికీ దీపావళి శుభాకాంక్షలు తెలియయ జేస్తున్నారు. 'సూపర్ జోడి.. దీపావళి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు విరుష్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇద్దరినీ ఇలా చూసి తెగ మురిసిపోతున్నారు.

అనుష్క శర్మ కొత్త అవతారం
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది అనుష్క శర్మ. విలక్షమైన పాత్రల్లో నటిస్తూ బీ టౌన్ ప్రేక్షకులను అలరిస్తోంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొన్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా ఆమెలోని హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని తాజా ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న ఈమె త్వరలో నిర్మాత అవతారమెత్తనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











