అనుష్క శర్మ ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారతీయ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తల్లిదండ్రులుగా మారబోతున్నారు. అనుష్క శర్మ గర్బం దాల్చినట్టు విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ వార్తను విరాట్, అనుష్క శర్మ ప్రకటించగానే వారికి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రులం కాబోతున్నామనే శుభవార్తను వారు వెల్లడిస్తూ..

Recommended Video

Virat Kohli Is To Become Father,Shares First Baby Bump Pic Of Anushka Sharma || Oneindia Telugu
ప్రస్తుతం నాలుగు నెలల ప్రెగ్సెన్సీతో అనుష్క శర్మ

ప్రస్తుతం నాలుగు నెలల ప్రెగ్సెన్సీతో అనుష్క శర్మ

తాజా సమాచారం ప్రకారం.. అనుష్క శర్మ నాలుగు నెలల గర్బవతి అని తెలుస్తున్నది. జనవరి 2021లో మాకు మొదటి సంతానం కలుగబోతున్నది. తర్వలోనే ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం అంటూ ఇద్దరు తమ వ్యక్తిగత అకౌంట్లలో వార్తను షేర్ చేశారు. దాంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ప్రేమలో పడిన తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారం తర్వాత వారిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకొన్నారు. 2017 డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

గతంలో గర్బవతి రూమర్లపై అనుష్క ఆగ్రహం

గతంలో గర్బవతి రూమర్లపై అనుష్క ఆగ్రహం

ఆ తర్వాత పలుమార్లు అనుష్క వర్మ గర్బవతి అనే రూమర్లు వచ్చాయి. కానీ విరాట్ కోహ్లీ దంపతులు ఆ వార్తలను కొట్టిపడేశారు. అలాంటి వార్త ఏదైనా ఉంటే మీతో పంచుకోవడానికి ఇబ్బందేమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. తాజా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన దంపతులు ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందించారు.

సినీ నిర్మాణం, వెబ్ సిరీస్‌పై దృష్టి

సినీ నిర్మాణం, వెబ్ సిరీస్‌పై దృష్టి

లాక్‌డౌన్‌లో ఇంటికి పరిమితమైన అనుష్క శర్మ సినీ నిర్మాణంపై దృష్టిపెట్టారు. పాతాళ్ లోక్, బుల్ బుల్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించి నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల చేశారు. పాతాల్ లోక్ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో బాలీవుడ్‌లో పలు సినిమాలను అనుష్క నిర్మించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌లో కరీనా తర్వాత అనుష్క శర్మ శుభవార్తలు

బాలీవుడ్‌లో కరీనా తర్వాత అనుష్క శర్మ శుభవార్తలు

ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌లో బాలీవుడ్‌లో శుభవార్త జోరు మొదలైంది. ఇటీవలే కరీనా కపూర్ దంపతులు తమ రెండో బిడ్డను కనబోతున్నామనే విషయాన్ని వెల్లడించారు. గతంలో సైఫ్, కరీనా దంపతులకు తైమూర్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ పేరెంట్స్ జాబితాలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ చేరబోతుండటం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X