అనుష్క-విరాట్ రిలేషన్లో స్పెషల్ మైల్‌స్టోన్... అదే ఊపులో బ్రహ్మాండం బద్దలవుతుందా?

Recommended Video

Virat Kohli,Anushka Sharma Planing Vacation For First Wedding Anniversary | Filmibeat Telugu

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి తమ రిలేషన్ షిప్‌లో స్పెషల్ మైల్‌స్టోన్ అందుకోబోతున్నారు. డిసెంబర్ 11న ఈ సెలబ్రిటీ కపుల్ మొదటి పెళ్లి రోజు జరుపుకోబోతున్నారు. ఈ స్పెషల్ డేను వారు ఆస్ట్రేలియాలో సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి ప్రస్తుతం భారత జట్టు తరుపున ఆడుతూ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. దీంతో మొదటి పెళ్లి రోజు సెలబ్రేషన్స్ ఆస్ట్రేలియాలోనే జరుపుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం జీరో ప్రమోషన్లలో బిజీగా ఉన్న అనుష్క శర్మ డిసెంబర్ 11 ముందే ఆస్ట్రేలియా చేరుకోనుంది.

తొలి టెస్ట్ ముగిసిన అనంతరం

తొలి టెస్ట్ ముగిసిన అనంతరం

భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరుగబోతోంది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా సభ్యులతో కలిసి అనుష్క-విరాట్ తమ పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటారని తెలుస్తోంది.

‘జీరో' టీమ్ నుంచి పర్మిషన్ గ్రాంటెడ్

‘జీరో' టీమ్ నుంచి పర్మిషన్ గ్రాంటెడ్

నెల రోజుల ముందు నుంచే అనుష్క శర్మ తమ పెళ్లి రోజు ప్లాన్ చేసుకుంటోందట. అనుష్క-విరాట్ జీవితంలో స్పెషల్ డే కావడంతో ‘జీరో' మూవీ టీమ్ నుంచి కూడా పర్మిషన్ లభించింది. విరాట్‌తో కలిసి మూడు రోజులు ఆస్ట్రేలియాలో గడిపిన అనంతరం ఆమె ఇండియా తిరిగి వస్తుందట.

ఇటలీలో ఒక్కటైన విరాట్-అనుష్క

ఇటలీలో ఒక్కటైన విరాట్-అనుష్క

2017 డిసెంబర్లో విరాట్ కోహ్లి-అనుష్క శర్మ ఇటలీలో టుస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో జరిగిన అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్స్‌లో ఒకటిగా ఇది నిలిచింది. ఢిల్లీలో నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరైన సంగతి తెలిసిందే.

ఆ ఉత్సాహంలో ఎవరూ సాధించలేనిది బ్రహ్మాండం సాధిస్తాడా?

ఆ ఉత్సాహంలో ఎవరూ సాధించలేనిది బ్రహ్మాండం సాధిస్తాడా?

పెళ్లి తర్వాత అనుష్క, కోహ్లి మరింత ఉత్సాహంగా తమ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో విజయాలు అందుకుంటున్నారు. ఇదే ఊపులో తొలి పెళ్లి రోజు జరుపుకున్న అనంతరం విరాట్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు అభిమానులు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను గెలిచి కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోవాలని విరాట్ కోహ్లీ చూస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X