twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూతురుకు అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ నామకరణం.. చిన్నారి పేరు వెనుక అంత ప్రాముఖ్యత ఉందంట!

    |

    బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జీవితాల్లోకి 2021 సంవత్సరం మరింత ఆనందాన్ని తీసుకువచ్చింది. తమ జీవితాల్లోకి కూతురు అడుగుపెట్టడంతో వారి ఆనందానికి ఎల్లలూ లేకుండా పోయాయి. తాజాగా తన కూతురు గురించి అనుష్క శర్మ చేసిన ట్వీట్, ఇన్స్‌టాగ్రామ్ పోస్టులు వైరల్‌గా మారాయి. తన సోషల్ మీడియా అకౌంట్‌లో అనుష్క శర్మ చేసిన కామెంట్లు ఏమిటంటే..

    విరుష్క దంపతుల జీవితంలోకి

    విరుష్క దంపతుల జీవితంలోకి

    విరుష్క దంపతులకు జనవరి 11వ తేదీన కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తన ముద్దుల చిన్నారి రాకతో అనుష్క, విరాట్ కోహ్లి కుటుంబంతోపాటు సన్నిహితుల్లో సంతోషం నెలకొన్నది. ఈ సందర్భంగా విరుష్క దంపతులకు సోషల్ మీడియాలో అభినందనల సందేశాలు సునామీలా వెలువెత్తాయి.

    కూతురుకు వమికాగా నామకరణం

    కూతురుకు వమికాగా నామకరణం

    ఇక అనుష్క, విరాట తమ కూతురుకు వమికా అనే నామకరణం చేశారు. తమ కూతురును ప్రేమతో ముద్దాడుతూ ఉన్న ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా తమ కూతురు పేరును కూడా పోస్టులో ప్రస్తావించారు. ఫోటోతో అనుష్క, విరాట్ భావోద్వేగానికి గురయ్యారు. తమ భావోద్వేగాన్ని ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌ పోస్టుల ద్వారా అభిమానులతో పంచుకొన్నారు.

    Recommended Video

    PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
    మా జీవితాన్ని మరో లెవెల్‌కు

    మా జీవితాన్ని మరో లెవెల్‌కు

    తన కూతురు గురించి సోషల్ మీడియాలో అనుష్క శర్మ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా మేము అద్భుతమైన ప్రజెన్స్, గ్రాటిట్యూడ్, లవ్‌తో కలిసి జీవించాం. కానీ మా చిన్నారి వమికా మాత్రం మా జీవితాలను ఊహించని విధంగా మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. చిన్నారి మా జీవితాల్లోకి ప్రవేశించిన కొన్ని క్షణాల్లోనే ఆనందభాష్పాలు, సంతోషం, బాధ, ఉద్ద్వేగం లాంటి అంశాలు మాలో కలిగాయి అంటూ పోస్టులో వెల్లడించారు.

    వమికా పేరుకు అర్ధం ఏమిటంటే...

    వమికా పేరుకు అర్ధం ఏమిటంటే...

    ఇక వమికా పేరు హిందూ శాస్త్రాల ప్రకారం అర్ధం ఏమిటంటే.. వమికా అంటే దుర్గామాత అని అర్థం. వమికా అంటూ శక్తికి మరోపేరుగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తాము ఆరాధించే దుర్గామాత పేరునే వమికాగా విరాట్, అనుష్కలు తమ కూతురుకు నామకరణం చేయడం విశేషం. ఏది ఏమైనా విరాట్, అనుష్క జీవితాల్లో వమికా మరింత ఆనందాన్ని నింపుతున్నట్టు స్పష్టమైంది.

    English summary
    Anushka Sharma and Virat Kohli gets emotional about their daughter Vamika. Anushka posts message in Insta that We have lived together with love , presence and gratitude as a way of life but this little one , Vamika ❤️ has taken it to a whole new level!. Tears , laughter , worry , bliss - emotions that have been experienced in a span of minutes sometimes !
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X