అనుష్క, విరాట్ విడాకులు.. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా షాకింగ్ న్యూస్.. ఇంతకు ఏం జరిగిందంటే
నటి మీరా చోప్రాకు ఎదురైన సంఘటనతో సోషల్ మీడియాలో ఎలాంటి దారుణాలు చోటుచేసుకొంటాయో అనే విషయాన్ని ఇంకా మరిచిపోకముందే నెటిజన్లు విరాట్ కోహ్లీ, అనుష్కను టార్గెట్ చేసుకొని ట్విట్టర్‌లో వివాదం సృష్టించారు. విరుష్క విడిపోతున్నారంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను సృష్టించి ట్రెండ్ చేశారు. ఈ అంశం నేషనల్ వైడ్‌గా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నెటిజన్ల ప్రవర్తన మరోసారి వివాదంగా మారింది. ఇంతకు ఈ విషయంలో ఏం జరిగిందంటే...

పెళ్లి చేసుకొని హ్యాపీగా
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ పెళ్లి చేసుకొని ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. లాక్‌డౌన్‌లో వారిద్దరి మధ్య భార్య, భర్తల అనుబంధం చక్కగా కనిపించింది. చిలిపి చిలిపి సంఘటనలతో వారు గత మూడు నెలలుగా స్వీయ గృహ నిర్బంధంలో జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.

అనుష్క పాతాల్‌లోక్‌పై విరాట్ ప్రశంసలు
లాక్‌డౌన్‌లో ఉంటూనే అనుష్క నిర్మాతగా మారి రిలీజ్ చేసిన పాతాళ్‌లోక్ వెబ్ సిరీస్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. తన భార్య రూపొందించిన వెబ్ సిరీస్ అద్భుతంగా ఉందని, ఆమె ప్రతిభాపాటవాలకు ఇదో మచ్చు తునక అంటూ విరాట్ కోహ్లీ పొగడ్తలతో ముంచెత్తారు. అలా వారిద్దరి మధ్య సమన్వయంతో వైవాహిక జీవితం కొనసాగుతుంటే వారిద్దరి విడిపోతున్నారనే వార్త ట్విట్టర్‌లో కనిపించింది.

విరుష్క విడాకులు తీసుకొంటున్నారంటూ
అయితే ఉన్నట్టుండి శుక్రవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో అనుష్క, విరాట్ కోహ్లీ (విరుష్క) విడాకులు తీసుకొంటున్నారంటూ #VirushkaDivorce హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. దీనికి మర్మ ఏమిటో గానీ, ఏ ఉద్దేశంతో చేశారో గానీ ప్రస్తుతం ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌గా మారింది.

అభిమానుల ఆగ్రహం
ఇదిలా ఉంటే.. #VirushkaDivorce హ్యాష్ ట్యాగ్‌ను విరాట్, అనుష్క స్వయంగా ప్రమోట్ చేస్తున్నారనే ట్వీట్లు కూడా కనిపించంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను చూసి విదేశీ అభిమానులు కూడా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకంటే విషాదం మరోటి ఉండదు అనే ట్వీట్ చేస్తున్నారు.
Recommended Video

నెటిజన్ల తీరుపై మీమ్స్ వైరల్
ఇక విరాట్, అనుష్క విడాకుల ట్వీట్స్ ఓ పక్క హోరెత్తుతుంటే మరో పక్క ఈ ట్రెండింగ్‌పై అసహనం వ్యక్తం చేసిన మీమ్స్ వైరల్‌గా మారాయి. ఈ వార్తను చూసిన తర్వాత విరాట్, అనుష్క ఫీలింగ్స్ ఇలానే ఉంటాయంటూ మీమ్స్ చాలా గమ్మత్తుగా, నవ్వు పుట్టించేలా ఉన్నాయి. ఏది ఏమైనా ఇది ఫేక్ న్యూస్ అనే విషయం స్పష్టంగా తెలుస్తుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు విసిరారు.


Click it and Unblock the Notifications











