షారుక్ ఖాన్ ఇంటికి అర్ధరాత్రి తాగి వెళ్లిన కపిల్ శర్మ.. ఏకంగా బెడ్ రూమ్ లో అలా..
టాప్ ఇండియన్ స్టాండప్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఎలాంటి షోలో కనిపించినా కూడా నాన్ స్టాప్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇక నెగిటివ్ ఆడియెన్స్ కూడా అతనికి చాలా తక్కువగానే ఉంటారు. అయితే ఒకానొక సమయంలో కపీల్ శర్మ డ్రింక్ చేసి షారుక్ ఖాన్ ఇంటికి వెళ్లాడట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ స్టార్ కమెడియన్ ఆ విషయాలను గుర్తు చేసుకున్నాడు.

హార్డ్ వర్క్ చేసి..
మొదట కపిల్ శర్మ కొన్ని స్టేజ్ షోల ద్వారా మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. అతను స్కూల్ దశలోనే తన అల్లరితో అందరిని ఎంతగాని నవ్విస్తూ వచ్చాడు. ఇక మెల్లగా టెలివిజన్ లోకి వచ్చి కొన్ని కామెడీ రియాలిటీ షోలతో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నడు. అయితే అతను స్టార్ కమెడియన్ గా క్రేజ్ అందుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎంతగానో హార్డ్ వర్క్ చేశాడు కూడా.

కామెడీ షోలు మాత్రమే కాకుండా
కేవలం టెలివిజన్ కామెడీ షోలు మాత్రమే కాకుండా కపిల్ శర్మ పలు సినిమాల్లో కూడా నటించాడు. ABCD2 , ఫిరంగి , ఇట్స్ మై లైఫ్ వంటి సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రల్లో నటించారు. పలు హాలీవుడ్ సినిమాలకు కూడా హిందీ డబ్బింగ్ చెప్పాడు. కపిల్ శర్మకు మధ్యలో హీరోగా కూడా పలు అవకశాలు వచ్చాయి కానీ ప్రస్తుతం చేస్తున్న కామెడీ షోలతోనే లైఫ్ బావుంది అని వాటి జోలికి వెళ్లలేదు.

ఆ షోలో ద్వారా భారీ క్రేజ్
2006 నుంచి కపిల్ శర్మ టెలివిజన్ షోలతో బిజీగా కనిపిస్తున్నాడు. కేవలం గెస్ట్ గానే కాకుండా హోస్ట్ గా ప్రసెంటర్ గా కూడా కపిల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం కపిల్ శర్మ సీజన్ 2 షో ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న టీవీ హోస్ట్ లలో కూడా కపిల్ శర్మ టాప్ లిస్ట్ లో ఉన్నాడు.

తాగేసి షారుక్ ఇంటికి..
ఇక ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న కపిల్ శర్మ: ఐ యామ్ నాట్ డన్ ఎట్.. షోలో ఒక విషయాన్ని తెలియజేశారు. ఒకసారి షారుక్ ఖాన్ ఇంటికి ఫుల్లుగా తాగేసి ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్ళారట. తగినట్లు కాస్త ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా కపిల్ శర్మ అలానే సరాసరి షారుక్ ఇంట్లోకి వెళ్లిపోవడం జరిగిందట.

అర్ధరాత్రి సమయంలో..
కపిల్ మాట్లాడుతూ.. నా కజిన్ ఒకరు షారుక్ ఇంటిని చూడాలని చెప్పడంతో తాగుతున్న సమయంలోనే సరాసరి వారి ఇంటికి వెళ్ళాను. అర్ధరాత్రి 3 గంటల సమయంలో అప్పుడే అక్కడ పార్టీ జరుగుతోంది. ఇక పార్టీకి నన్ను పిలిచారనుకొని సెక్యూరిటీ గార్డు కూడా పట్టించుకోలేదు. ఇక షారుక్ భార్య కూడా అలానే అనుకుని షారుక్ ఆ గదిలో ఉన్నట్లుగా చెప్పారని కపిల్ తెలిపాడు.
Recommended Video

ఏకంగా బెడ్ రూమ్ లో..
ఇక షారుక్ ఖాన్ గదిలోకి వెళ్ళగానే అక్కడ ఆయన ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఇక వెంటనే నా కజిన్ మీ ఇల్లు చూద్దామని అనుకుంటే ఇలా తీసుకు వచ్చాను అని షారుక్ తో చెప్పాను. అప్పుడు ఆయన నువ్వు ఏకంగా నా బెడ్ రూమ్ లోకి వచ్చేశావు అని సరదాగా అన్నారు. అనంతరం ఆయనతో డ్యాన్స్ చేసి తిరిగి వెళ్ళేటప్పుడు వారి స్టాఫ్ తో కూడా ఫొటోలు తీసుకున్నారు. ఇక ఆ ఫొటోలు షారుఖ్ తియ్యడం విశేషం.. అని కపిల్ తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











