Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిల్ బేచారా మాకెంతో ప్రత్యేకం.. సుశాంత్‌కు నివాళి అర్పించిన రెహమాన్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బేచారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దిల్ బేచారా ట్రైలర్ ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అది సుశాంత్‌కు అభిమానులు ఇచ్చిన నివాళి. సుశాంత్ చివరి చిత్రం కావడం, సుశాంత్ మరణం ఇంకా అందర్నీ వెంటాడుతూ ఉండటంతో దిల్ బేచారాపై అందరూ ప్రత్యేకంగా శ్రద్ద చూపిస్తున్నారు. సినిమా ద్వారా సుశాంత్‌ను సజీవంగా చూస్తున్నామనే భావన చాలా మందిలో ఉంది. అందుకే దిల్ బేచారా చిత్రాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు నిర్మాతలు ప్రయత్నించారు.
దిల్ బేచారా ట్రైలర్, పాటలు ఇప్పటికే అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేశాయ్. ఈ క్రమంలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సుశాంత్‌కు సంగీత నివాళి అర్పించాడు. సింగర్లందరితో దిల్ బేచారా టైటిల్ ట్రాక్ లైవ్ కాన్సర్ట్ చేయించాడు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ మాటలు, ఈ కాన్సర్ట్ అందర్నీ ఆకట్టుకుంటాయి. ఈ ఆల్బమ్ ప్రారంభంలో ఏఆర్ రెహమాన్ చెప్పిన మాటలు అందర్నీ టచ్ చేస్తున్నాయి.
దిల్ బేచారా మ్యూజిక్, పాటలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ సినిమా కోసం రూపొందించిన తొమ్మిది పాటలు ఈ రోజు కొత్త అర్ధాన్ని ఇస్తున్నాయి. అది పూర్తిగా ఓ కొత్త జీవితం. ఈ సినిమా కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడానికి మనకు శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ పాటలన్నీ సుశాంత్‌కు అంకితమిస్తున్నా' అని పేర్కొన్నాడు. ఈ నెల 24న ఈ సినిమా అందరికీ అందుబాటులోకి రానుంది. హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే.