నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమాకు నిర్మాతగా ఏఆర్ రెహ్మాన్
సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సరికొత్త పాత్రను పోషించబోతున్నారు. విలక్షణ నటుడు నవాజుద్దీన్ నటిస్తున్న నో ల్యాండ్స్ మ్యాన్ అనే చిత్రానికి సహ నిర్మాతగా మారారు. ఆ చిత్రానికి రెహ్మన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అ క్రమంలో ఆయన ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకోవడం విశేషంగా మారింది.
ఏఆర్ రెహ్మన్ తన సినిమాకు నిర్మాతగా మారిన విషయాన్ని నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. నేను నటిస్తున్న నో ల్యాండ్స్ మ్యాన్ సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ సహ నిర్మాతగా మారిన విషయాన్ని తెలియజేయడానికి నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఈ చిత్రాన్ని ముస్తాఫా సర్వర్ ఫరూఖీ రూపొందిస్తున్నారు అంటూ పేర్కొన్నారు.

ఇండియా, బంగ్లాదేశ్ అమెరికా దేశాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు ముస్తాఫా సర్వర్ ఫరూఖీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇర్ఫాన్ ఖాన్ నటించిన దూబ్: ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అనే సినిమాను రూపొందించారు. ఈ చిత్రం ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండియాతోపాటు న్యూయార్క్‌లో షూటింగు జరుపుకొన్నది.


Click it and Unblock the Notifications











