ఆమెకు విడాకులిచ్చి మరో మోడల్‌తో.. పబ్లిక్‌గా చెప్పేసిన స్టార్ హీరో తమ్ముడు!

శృంగార భామ మలైకా అరోరా, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ చాలా రోజుల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అర్బాజ్ ఖాన్ 1998 లో మలైకా అరోరాని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అర్హన్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. మనస్పర్థలు ఏర్పడడంతో దాదాపు 19 ఏళ్ళ దాంపత్య జీవితం తరువాత 2017 లో ఈ జంట విడిపోయింది. బాలీవుడ్ లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. వీరిద్దరూ విడిపోయిన తరువాత చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

హాట్ మోడల్‌తో సహజీవనం

హాట్ మోడల్‌తో సహజీవనం

మలైకా నుంచి విడిపోయాక అర్భాజ్ ఖాన్ ఓ మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవడ్ మీడియాలో చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు జార్జియా ఆండ్రియాని. ఈ వార్తల గురించి సల్మాన్ ఖాన్ కుటుంబం స్పందించలేదు. సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ నిర్వహించిన గణేష్ చతుర్థి పూజలో వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. వీరితో పారు అర్భాజ్ ఖాన్ తనయుడు అర్హన్ కూడా ఉండడం విశేషం.

 ప్రకటించేశాడు

ప్రకటించేశాడు

జార్జియా మోడల్ గా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో చెలరేగుతుంటుంది. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. జార్జియాతో కలసి తాను నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నట్లు అర్బాజ్ ఖాన్ అధికారికంగా తన సోషల్ మీడియాలో ప్రకటించాడు.

అంతా నిజమే

అంతా నిజమే

జార్జియాతో డేటింగ్ గురించి స్యయంగా అర్బాజ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నా విడాకుల తరువాత చాలా వార్తలు వస్తున్నాయి. ఎవరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు అంతా అనుకుంటున్నారు. అవును. అది నిజమే. తాను, జార్జియా డేటింగ్ లో ఉన్నామని అర్భాజ్ ఖాన్ అంగీకరించాడు.

Recommended Video

Malaika Arora Talks About Her Present Life Style
 యంగ్ హీరోతో మాజీ భార్య

యంగ్ హీరోతో మాజీ భార్య

ఇదిలా ఉండగా మలైకా అరోరా గురించి కూడా బాలీవుడ్ లో కథలు వినిపిస్తున్నాయి. యువ హీరో అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య ఎదో జరుగుతున్నట్లు అంతా భావిస్తున్నారు. అప్పుడప్పుడూ వీరిద్దరూ చెట్టా పట్టాలేసుకుని పబ్లిక్ గా కనిపించడం సంచలనంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X