విడాకులతో జీవితం ఆగిపోదు, ఆమెతో ఎఫైర్ నిజమే.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు!
'దబాంగ్ 3' నిర్మాత, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరాతో విడిపోయిన తర్వాత... జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ మధ్య బాలీవుడ్లో జరిగే ఫంక్షన్లకు ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. నిన్న మొన్నటి వరుకు తాము డేటింగ్ చేస్తున్న విషయం ఒప్పుకోవడానికి నిరాకరించిన ఈ జంట ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. తాము రిలేషన్లో ఉన్నది నిజమే అని స్పష్టం చేశారు.

ఆమె నా స్నేహితురాలు, డేటింగులో ఉన్నాం
ఓ ఆంగ్లపత్రికతో అర్భాజ్ ఖాన్ మాట్లాడుతూ... ‘జార్జియా ఆండ్రియాని నా స్నేహితురాలు. ఇద్దరం డేటింగులో ఉన్నాం. అయితే మా బంధం ఎక్కడి వరకు వెళుతుంది అనేది ఇప్పుడే చెప్పలేను. కాలమే దానికి సమాధానం చెబుతుంది' అన్నారు.

నన్ను ఎంకరేజ్ చేస్తుంది
జార్జియా ఆండ్రియాని నన్ను అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తుంది. ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత మరింత పాజిటివ్‌నెస్ వచ్చింది అని అర్భాజ్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఆమె నా మనసుకు ఎంతో దగ్గరైందని వెల్లడించారు.

విడాకుల తర్వాత
మలైకా అరోరాతో విడాకుల విషయంపై ఇండైరెక్టుగా స్పందిస్తూ.. ‘మన జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి మూలంగా మన జీవితం ఒకే చోట ఆగిపోకూడదు. కొన్నింటిని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేసి ముందుకు సాగిపోతూనే ఉండాలి' అని అర్భాజ్ వ్యాఖ్యానించారు.

పెళ్లి విషయం దాటవేత
జార్జియా ఆండ్రియానితో మీ పెళ్లి జరుగుతుందా? అంటే మాత్రం... అర్భాజ్ ఖాన్ దాటవేత ధోరణి ప్రదర్శించాడు. ఈ అంశంపై స్పందించడానికి అతడు ఇష్టపడలేదు. మరి వీరి బంధం ఎంత వరకు వెళుతుందో అని బాలీవుడ్లో అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

అర్జున్ కపూర్‌తో మలైకా
అర్భాజ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరా.... బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











