Don't Miss!
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నా లైఫ్ నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తించేంది.. విడాకులకు కారణం అదే.. ఎట్టకేలకు బయటపెట్టాడు!
నాలుగు పదుల వయసులోనూ హాట్ నెస్ తో అదరగొడుతోంది మలైకా. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. తరచుగా వివాదాలు, మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత మలైకా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అర్భాజ్ ఖాన్ కూడా మరో మోడల్ తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ విడాకుల గురించి మీడియా ముందు పెద్దగా స్పందించింది లేదు. ఓ ఇంటర్వ్యూలో మాత్రం మలైకా విడాకుల దారి తీసిన పరిస్థితులని వివరించింది. తాజాగా అర్భాజ్ ఖాన్ కూడా మలైకాతో విడిపోవడం గురించి తొలిసారి మాట్లాడారు.
ప్రతి రోజూ గొడవలే
ఆ మధ్యన మలైకా అరోరా కరీనా కపూర్ నిర్వహిస్తున్న 'వాట్ వుమెన్ వాంట్' అనే షోలో పాల్గొంది. ఈ షోలో మలైకా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించింది. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోవడం గురించి మాట్లాడుతూ.. మా మధ్యన ప్రతి రోజూ ఏదో ఒక సమస్య తలెత్తేది. దానివలన ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడేవారు. అందువల్లే విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని మలైకా అరోరా అప్పట్లో తెలిపింది. దాదాపు 19 ఎలా పాటు కొనసాగిన వీరి దాంపత్య జీవితం 2017లో ముగిసింది.
నా లైఫ్ నా ఇష్టం
అర్భాజ్ ఖాన్ ఇటీవల అనుపమ చోప్రా నిర్వహిస్తున్న చాట్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో అర్భాజ్ ఖాన్ తొలిసారి మలైకా నుంచి విడాకుల పొందడం గురించి మాట్లాడాడు. అర్భాజ్ మాట్లాడుతూ.. మామధ్య సంబంధం బాగా సన్నగిల్లింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా లైఫ్ నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తించేది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు భార్య భర్తలుగా కలసి ఉండడంలో అర్థం లేదు. ఎవరి జీవితం వాళ్లకు ఉందనే భావన వచ్చినప్పుడు విడిపోవడమే మంచిదనిపించినట్లు అర్భాజ్ ఖాన్ తెలిపాడు.
అర్జున్ కపూర్‌తో ఎఫైర్
అర్భాజ్ నుంచి విడిపోయిన తర్వాత మలైకా అరోరా, అర్జున్ కపూర్ మధ్య ప్రేమ బాగా ముదిరింది. ఓ రకంగా అర్భాజ్, మలైకా మధ్య మనస్పర్థలకు కారణం అర్జున్ కపూర్ తో ప్రేమాయణమే అనే రూమర్స్ బాలీవుడ్ లో ఉన్నాయి. త్వరలో అర్జున్ కపూర్, మలైకా వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ ఆసుపత్రిలో కనిపించడం కూడా నేక ఊహాగానాలకు కారణం అవుతోంది.
పెళ్లిపై నమ్మకం ఉంది
తన జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికి వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని అర్భాజ్ ఖాన్ తెలిపారు. మానవ సంబంధాలు వందల వేల సంవత్సరాల నుంచి పెళ్ళితోనే ముడిపడి సాగుతున్నాయని అర్భాజ్ ఖాన్ తెలిపాడు. అర్భాజ్ ఖాన్ ప్రస్తుతం ఓ మోడల్ తో సహజీవనం చేస్తున్నాడు.