కుర్ర హీరోతో ఆమె రెండో వివాహం.. రాత్రంతా అలోచించి అడిగావు కదూ!

నాలుగు పదుల వయసులోనూ హాట్ నెస్ తో అదరగొడుతోంది మలైకా. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. తరచుగా వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మలైకా అరోరా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి మలైకా విడిపోవడం ఇప్పటికి బాలీవడ్ లో హాట్ టాపిక్కే. త్వరలో మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

నాలుగు పదుల వయసులో కూడా

నాలుగు పదుల వయసులో కూడా

హాట్ బ్యూటీ మలైకా అరోరా నాలుగు పదుల వయసులో కూడా కుర్ర హీరోతో ప్రేమ వ్యవహారాలు సాగిస్తోంది. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా ప్రేమ వ్యవహారం గురించి బాలీవుడ్ అంతటా చర్చ జరుగుతోంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని మలైకా వివాహం చేసుకుంది. దాదాపు 18 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత విభేదాలతో మలైకా అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.

 వయసు వ్యత్యాసం

వయసు వ్యత్యాసం

మలైకా అరోరా కన్నా అర్జున్ కపూర్ 12 ఏళ్ళు చిన్నవాడు. వీరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉన్నా ప్రేమలో పడ్డారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. త్వరలో ఈ జంట వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 19న వీరి వివాహం జరగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీని గురించి అధికారిక ప్రకటన లేదు.

రాత్రంతా ఆలోచించావా

రాత్రంతా ఆలోచించావా

ఇటీవల అర్భాజ్ ఖాన్ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఓ మీడియా ప్రతినిధి అర్భాజ్ ఖాన్ ని మలైకా అరోరా రెండో వివాహం గురించి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అర్భాజ్ ఖాన్ తెలివిగా తప్పించుకున్నాడు. నన్ను ఈ ప్రశ్న అడగడానికి రాత్రంతా ఆలోచించావు కదూ అని సరదాగా సమాధానం ఇస్తూ నవ్వుతూ ఉండిపోయాడు. రాత్రంతా అలోచించి ఈ ప్రశ్న అడిగావు.. మరి సమాధానం చెప్పడానికి నాకెంత సమయం పడుతుంది. నేను సమాధానం చెప్పే లోపు లంచ్ టైం అయిపోతుంది. మనమంతా వెళ్ళిపోతాం అని అర్భాజ్ బదులిచ్చాడు.

 అర్భాజ్ కూడా

అర్భాజ్ కూడా

మలైకా నుంచి విడిపోయాక అర్భాజ్ ఖాన్ కూడా ఓ మోడల్ తో డేటింగ్ చేస్తున్నాడు, జార్జియా అనే మోడల్, అర్భాజ్ ఖాన్ ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ సమయంలో అయినా ఈ జంట వివాహం చేసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తామిద్దరి మధ్య ఉన్న సమస్యల వలన కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుండడంతో విడిపోయామని మలైకా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X