Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
స్టార్ హీరో తమ్ముడు ఇంకా మారలేదా, 2.75 కోట్లు.. పోలీసులకు చిక్కి పరువు పోగొట్టుకుని!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం అర్భాజ్ ఖాన్ మరో మోడల్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్భాజ్ ఖాన్ ప్రస్తుతం పించ్ అనే ఆన్లైన్ చాట్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ప్రలువురు బాలీవుడ్ తారలు అతిథులు గా హాజరవుతున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ ధావన్ ఇటీవల ఈ షోలో పాల్గొన్నాడు. ఆన్లైన్ లో ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు వీరిద్దరూ సమాధానం ఇస్తుంటారు. ఓ అభిమాని నుంచి అర్భాజ్ ఖాన్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
2.75 కోట్లు పోగొట్టుకుని
అర్భాజ్ ఖాన్ గత ఏడాది ఐపీఎల్ సంధర్భంగా వార్తల్లో నిలిచాడు. అర్భాజ్ ఖాన్ భారీ స్థాయిలో ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. విచారణలో అర్భాజ్ ఖాన్ బెట్టింగులకు పాల్పడి 2. 75 కోట్లకు నష్టపోయినట్లు తేలింది. అప్పట్లో ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగు రాయుళ్లు బాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. కానీ అర్భాజ్ ఖాన్ పేరు బయటకు వచ్చి పరువు పోగెట్టేలా చేసింది.
ఐపీఎల్ సందడి
ప్రస్తుతం 2019 సీజన్ ఐపీఎల్ జోరుగా సాగుతోంది. అభిమానులు, సినీతారలు ఐపీఎల్ మ్యాచులని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా బెట్టింగులు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గతంలో ఐపీఎల్ బెట్టింగుల విషయంలో బడా బాలీవుడ్ తారల పేర్లు వినిపించాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా బెట్టింగులని పూర్తిగా అరికట్టలేకున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని క్రికెట్ బెట్టింగ్ గురించి అర్భాజ్ ఖాన్ ని ప్రశ్నించారు.
మారారా లేదా
అర్భాజ్ ఖాన్ సర్.. ఐపీఎల్ సీజన్ జరుగుతోంది.. ఇంకా బెట్టింగులు చేస్తున్నారా.. ఇప్పటికైనా మారారా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నని వరుణ్ ధావన్ చదివి వినిపించడంతో అర్భాజ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత సరదాగానే సమాధానం ఇచ్చాడు. లేదు భయ్యా.. నేను బెట్టింగులు చేయడం లేదు. ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా అని అర్భాజ్ బదులిచ్చాడు. ఐపీఎల్ ని చూసి ఎంజాయ్ చేయడంలోనే మజా ఉంది అని అర్భాజ్ ఖాన్ పేర్కొన్నాడు.
బుకీలతో సంప్రదింపులు
గత ఏడాది అర్భాజ్ ఖాన్ పలు కేసులు ఎదుర్కొంటున్న క్రికెట్ బుకీ సోను బట్లతో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. వీరిద్దరి మధ్య బెట్టింగ్ విషయంలో గొడవ చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అప్పట్లో వీరిద్దరిని రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఆ కేసు నుంచి ఎలాగో బయటపడ్డ అర్భాజ్ ఖాన్ ప్రస్తుతం బెట్టింగులకు దూరంగా ఉంటున్నాడు.