మరే భర్త నాలాగా చేసి ఉండరు.. 21 ఏళ్లపాటు ఆమెతో.. మలైకాతో విడాకుల గురించి ఎట్టకేలకు!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తన మాజీ భార్య మలైకా అరోరాతో విడాకుల గురించి ఎట్టకేలకు స్పందించాడు. 2017లో వీరిద్దరూ అధికారికంగా విడాకులు పొందారు. ప్రస్తుతం ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా విభేదాల కారణంగా వీరి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు. తాజాగా అర్భాజ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడాకుల గురించి ప్రస్తావించాడు.

యంగ్ హీరో కారణం అంటూ
అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా విడిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఓ సంచలన విషయం ప్రచారం జరుగుతోంది. యువ హీరో అర్జున్ కపూర్ తో మలైకా రిలేషన్ లో ఉండడమే వీరి మధ్య విడాకులకు పరిస్థితి దారితీసిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మలైకా, అర్జున కపూర్ తో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.

అర్భాజ్‌కు తోడు దొరికింది
మరో వైపు అర్భాజ్ ఖాన్ కూడా తన తోడుని వెతుక్కున్నాడు. ప్రస్తుతం అర్భాజ్ ఖాన్ జార్జియా అనే మోడల్ తో సహజీవనం చేస్తున్నాడు. ఈ విధంగా మాజీ కపుల్స్ మలైకా, అర్భాజ్ మరో మారు వార్తల్లో నిలిచారు. అర్భాజ్ ఖాన్ ఇటీవలే తన రిలేషన్ ని అధికారికంగా ప్రకటించాడు. మలైకా అరోరా మాత్రం అర్జున్ కపూర్ వ్యవహారం గురించి మౌనం పాటిస్తోంది.

సర్దుకుపోవడానికి ప్రయత్నించా
మలైకాతో విడాకుల విషయం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో అర్భాజ్ ఖాన్ పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 21 ఏళ్ల పాటు సర్దుకు పోవడానికి ప్రయత్నించా. కానీ విజయవంతం కాలేదు. మరే భర్తా నాలాగా ప్రయత్నించి ఉండరని అర్భాజ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బంధం నిలబడాలంటే
జీవితంలో బంధాలు నిలబడాలంటే మనం ఏవిధంగా కష్టపడతామో భాగస్వామి నుంచి కూడా అదే విధమైన సపోర్ట్ ఉండాలని అర్భాజ్ ఖాన్ తెలిపాడు. ఎవరికీ జీవితంలో పర్ఫెక్ట్ గా ఉండే వ్యక్తులు దొరకరని తెలిపాడు. ఈ సమయంలో తాను ఫర్ఫెక్ట్ అని అనుకోవడం లేదని అర్భాజ్ ఖాన్ తెలిపాడు.

ఆ రూమర్ నిజమేనా
ఇదిలా ఉండగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ వచ్చే ఏడాది వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. అర్జున్ కపూర్, మలైకా అరోరా తమ సన్నిహితులతో కలసి సీక్రెట్ గా జరిగిన పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో వీరి రిలేషన్ షిప్ ని అధికారికంగా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











