డేట్‌కు వెళ్లిన హీరో, హీరోయిన్‌కు చేదు అనుభవం.. రూమ్‌లో అనూహ్య పరిణామం.. సినీ జంట షాక్.!
మిగిలిన రంగాలతో పోలిస్తే.. సినీ రంగంలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో ఇవి కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఎంతో మంది హీరో, హీరోయిన్లు లవ్ ట్రాక్‌లు నడిపిన వార్తలు బయటకు వచ్చాయి. వారిలో చాలా మంది మధ్యలోనే విడిపోగా.. కొందరు మాత్రమే తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లగలిగారు. అయితే, ఓ జంట మాత్రం చాలా కాలంగా పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో ఉంటోంది. తాజాగా ఈ హీరో, హీరోయిన్ డేట్‌కు వెళ్లగా వారికి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

ప్రేమలో ఉన్న ఈ ఇద్దరికీ 12 ఏళ్ల తేడా
చాలా కాంలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు స్టార్ హీరో అర్జున్ కపూర్, నటి మలైకా అరోరా. 33 ఏళ్ల ఈ హీరో.. ప్రముఖ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు కాగా, 45 ఏళ్ల ఈ నటి మాత్రం అర్భాజ్ ఖాన్ మాజీ భార్య. ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్‌తో డేటింగ్ చేస్తోంది. వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉండడం గమనార్హం.

ఆ విషయాన్ని మాత్రం దాయడం లేదు
వయసులో చాలా గ్యాప్ ఉన్న ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్త బీ టౌన్‌లో వినిపించిన సమయంలో అందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది దీన్ని నమ్మలేదు కూడా. అయితే, తమ డేటింగ్ విషయాన్ని ఇద్దరూ బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. ‘కాఫీ విత్ కరణ్' షోలో అర్జున్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా మలైన తమ బంధాన్ని ప్రకటించారు.

పెళ్లి కాలేదు.. కానీ ఒకే ఇంట్లో ఉంటున్నారు
మలైకా అరోరా, అర్జున్ కపూర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు. వీళ్ల బంధం పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. అయినప్పటికీ ఈ జంట ఒకే ఇంట్లో కలిసి ఉంటోంది. ముంబైలో వీళ్ల కోసం ఓ ప్రత్యేకమైన విల్లా కూడా ఉంది. అలాగే, తరచూ ఏదో ఒక చోటుకు వెళ్తూ కెమెరాల కంటికి చిక్కుతోంది. ఫలితంగా ఈ సినీ జంట తరచూ వార్తల్లో నిలుస్తోంది.

ఎంజాయ్ ముద్దు.. పెళ్లి మాత్రం వద్దు
ఈ బాలీవుడ్ ప్రేమ జంట పెళ్లి చేసుకోబోతుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఇద్దరూ స్పందించలేదు. కానీ, బీ టౌన్‌లో మాత్రం ఓ టాక్ ఉంది. ఇప్పటికే ఓ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న కారణంగా మలైకా.. అర్జున్‌తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా లేదట. అందుకే డేటింగ్ వరకు ఓకే.. పెళ్లి వద్దని ముందే అనుకున్నారని తెలుస్తోంది.
Recommended Video


డేట్‌కు వెళ్లిన హీరో, హీరోయిన్‌కు చేదు అనుభవం
అర్జున్ కపూర్, మలైకా అరోరా వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలని భావించి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్‌కు వెళ్లారు. అయితే, ఈ జంటకు అక్కడ చేదు అనుభవం ఎదురైందట. ఎంతో సరదాగా గడపుదామని రెస్టారెంట్‌లో ఓ రూమ్ తీసుకుంటే అక్కడ ఏసీ పని చేయలేదట. దీంతో సిబ్బందితో గొడవ పెట్టుకుని అసహనంతో బయటకు వచ్చేశారని ఓ న్యూస్ లీక్ అయింది.


Click it and Unblock the Notifications











