Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
హీరోతో కలసి హాస్పిటల్లో నటి.. పెళ్ళికి ముందే గర్భం?
Recommended Video
నాలుగు పదుల వయసులోనూ హాట్ నెస్ తో అదరగొడుతోంది మలైకా. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. తరచుగా వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మలైకా అరోరా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. త్వరలో మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మలైకా గురించి మరో సంచలన వార్త ప్రచారం జరుగుతోంది.
నాలుగు పదుల వయసులో కూడా
హాట్ బ్యూటీ మలైకా అరోరా నాలుగు పదుల వయసులో కూడా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారాలు సాగిస్తోంది. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా లవ్ ఎఫైర్ బాలీవుడ్ అంతటా చర్చనీయాంశంగా మారింది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని మలైకా వివాహం చేసుకుంది. దాదాపు 18 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత విభేదాలతో మలైకా అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.
త్వరలో వివాహం
మలైకా కన్నా అర్జున్ కపూర్ వయసులో దాదాపు 12 ఏళ్ళు చిన్న వాడు. మలైకా వయసు 45 ఏళ్ళు. తమ గురించి ఎవరేమనుకున్నా ఈ జంట మాత్రం పబ్లిక్ గా తిరుగుతూ ప్రేమలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ మాల్దీవులకు టూర్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి వివాహం గురించి చర్చ జరుగుతోంది. మలైకా, అర్జున్ కపూర్ ఇక వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయినట్లు వారి సన్నిహితులు చెప్పుకొచ్చారు.
ఆసుపత్రిలో మలైకా
మలైకా, అర్జున్ కపూర్ పెళ్లి గురించి చర్చ జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర ప్రచారం మొదలైంది. ఇటీవల మలైకా, అర్జున్ కపూర్ జంట ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కనిపించారు. వైరల్ భయాని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మలైకా, అర్జున్ కపూర్ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న వీడియోని కూడా పోస్ట్ చేశాడు. దీనితో నెటిజన్లలో ఊహాగానాలు పెరిగిపోయాయి. మలైకా అరోరా గర్భవతి అయ్యిందా అటూ చర్చ జరుగుతోంది.
|
మీడియాకు చిక్కకుండా
ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ అర్జున్ కపూర్, మలైకా మీడియాకు చిక్కకుండా వేగంగా వెళ్లిపోయారు. వీరిద్దరూ ఎంఆర్ఐ, సీటి స్కాన్ విభాగాల భవనం నుంచి బయటకు రావడంతో చర్చ మరింతగా జరుగుతోంది. అర్జున్ కపూర్, మలైకా చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో వీరిద్దరూ జంటగా కనిపించడంతో మలైకా గర్భవతి అయిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.