ప్రియుడితో మలైకా లంచ్ డేట్.. కొడుకుని కూడా తీసుకెళ్లింది!
బాలీవుడ్ లో మలైకా అరోరా హాట్ సెలెబ్రిటీ. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. తరచుగా వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మలైకా అరోరా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కుర్ర హీరో అర్జున్ కపూర్ తో మలైకా అరోరా రిలేషన్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎవరేమనుకున్నా పర్వాలేదు అన్నట్లుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు.

అర్జున్ కపూర్‌తో ఎఫైర్
మలైకా అరోరా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక కుర్ర హీరో అర్జున్ కపూర్ తో రొమాన్స్ మొదలు పెట్టింది. వీరిద్దరి మధ్య రిలేషన్ బహిరంగ రహస్యమే. తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టకపోయినా వీరిద్దరూ తరచుగా పార్టీలు, డిన్నర్ డేట్ లతో మీడియా కంటబడుతూనే ఉన్నారు. మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్ కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అర్జున్ కపూర్ ఆమెకన్నా వయసులో 12 ఏళ్ళు చిన్న. కానీ ఆ విషయాలేవీ పట్టించుకోకుండా ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు.

కుటుంబ సభ్యులు
అర్జున్ కపూర్ రిలేషన్ విషయంలో అతడి కుటుంబ సభ్యులు కూడా కల్పించుకోవడం లేదు. ఆ మధ్యన అనిల్ కపూర్ వీరిద్దరి ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఎలాగైనా అర్జున్ కపూర్ సంతోషంగా ఉంటే అదే చాలు అని తెలిపాడు. దీనితో కుటుంబ సభ్యుల నుంచి కూడా అర్జున్ కపూర్ కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అయింది.
కొడుకుని వెంటబెట్టుకుని
ఇప్పటి వరకు అర్జున్ కపూర్, మలైకా మాత్రమే పార్టీలకు , పబ్బులకు వెలుతూ కనిపించారు. కానీ తాజాగా మలైకా తన కొడుకు అర్హన్ ఖాన్ ని కూడా ప్రియుడి వద్దకు వెంటబెట్టుకుని వెళ్ళింది. వీరిద్దరూ లంచ్ డేట్ కు వెళ్లిన సమయంలో అక్కడ అర్హాన్ ఖాన్ కూడా కనిపించడం విశేషం. దీనితో అర్జున్ కపూర్, అర్హాన్ మధ్య బాండింగ్ పెరిగేలా చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలో వివాహం
మలైకా, అర్జున్ కపూర్ వివాహం గురించి గత ఏడాదే అనేక వార్తలు వినిపించాయి. ఈ ఏడాది వీరిద్దరూ సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు మలైకా అర్భాజ్ ఖాన్ కూడా ఆండ్రియాని అనే మోడల్ తో డేటింగ్ లో ఉన్నాడు. అర్భాజ్ ఖాన్, మలైకా 2016లో విడిపోయారు.


Click it and Unblock the Notifications











