For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయన లెజెండ్.. ఆ హీరోలకు సీన్‌ లేదు.. అర్జున్ కపూర్ కామెంట్లపై భగ్గుమన్న నెటిజన్లు

|

బాలీవుడ్‌లో మరో యాక్షన్ చిత్రం వార్ సినిమాతో స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. షూటింగ్ సందర్భంగా ట్రైగర్ ష్రాఫ్ ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటను ఉద్దేశించి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. అర్జున్ చేసిన వ్యాఖ్యలపై హృతిక్, ట్రైగర్ ష్రాఫ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇంతకు అర్జున్ కపూర్ ఏమని కామెంట్ చేశారంటే..

అర్జున్ కపూర్ కామెంట్స్

అర్జున్ కపూర్ కామెంట్స్

టైగర్ ష్రాఫ్ షేర్ చేసిన ఫొటో ప్రకారం.. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నేలపై కూర్చొని ఉండగా, దర్శకుడు ఆనంద్ సిద్ధార్థ్ కుర్చీలో కూర్చున్నాడు. ఆ ఫోటోను ఉద్దేశించి అర్జున్ కపూర్ కామెంట్ చేశారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ రెగ్యులర్ యాక్టర్లు, ఆనంద్ సిద్ధార్థ్ లెజెండ్ అని కామెంట్ చేశాడు. దాంతో ఆ ఇద్దరి హీరోల మనోభావాలు దెబ్బ తిన్నాయి.

నెటిజన్ల ట్రోల్స్

నెటిజన్ల ట్రోల్స్

అర్జున్ కపూర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘నీ మాటలు వాడి పెద్ద తప్పు చేశావు', మీరు అలాంటి మాటలు వాడకుండా ఉండాల్సింది. రెగ్యులర్ యాక్టర్లు అంటే ఆయన మాటల్లో అర్థం ఏమిటో, టైగర్ ష్రాఫ్‌తో పోల్చుకొనే అర్హత కూడా నీకు లేదు అంటూ నెటిజన్లు భగ్గుమన్నారు.

అక్టోబర్ 2న వార్

అక్టోబర్ 2న వార్

ఇక వార్ సినిమా విషయానికి వస్తే.. 2019లో రూపొందిన యాక్షన్ చిత్రంగా ఈ సినిమా ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్లను ఫిన్‌లాండ్‌లో చిత్రీకరించారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇదే రోజు మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం కూడా రిలీజ్ కానున్నది.

మలైకాతో అర్జున్ కపూర్ డేటింగ్

మలైకాతో అర్జున్ కపూర్ డేటింగ్

ఇక అర్జున్ కపూర్ విషయానికి వస్తే, ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా ఆరోరాతో పీకల్లోతు అఫైర్‌లో ఉన్నారు. వారిద్దరి ప్రేమ కహానీ ఇప్పుడు బాలీవుడ్‌లో కథలు, కథలుగా చెప్పుకొంటున్నారు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ తర్వాత, సందీప్ ఔర్ పింకీ పరార్, పానిపట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

English summary
Bollywood Arjun Kapoor took to Instagram to comment on Tiger Shroff's photo, which also featured Hrithik Roshan and War director Siddharth Anand. Actor Tiger Shroff posted a photo on his Instagram handle, featuring his War co-star Hrithik Roshan and director Siddharth Anand. While Hrithik and Tiger were seen sitting on the floor, Siddharth was seen resting on a chair. Arjun called Siddharth "a legend", but resorted to "regular actors".
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more