హీరోకు గుండు కొట్టించారు.. కనిపించకుండా ముఖం చాటేసిన స్టార్!

సినిమాకు సంబంధించిన పాత్రల కోసం సినీ తారలు మేకోవర్ కావడం అందరికీ తెలిసిందే. పాత్ర కోసం బరువు పెరగడం, తగ్గడం లాంటి చేస్తూ ఉంటారు. తాజాగా హీరో అర్జున్ కపూర్‌‌ పాత్ర కోసం గుండు కొట్టించుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. స్టార్ హీరో గుండు కొట్టించుకోవడం వెనుక కథేంటి? అసలేం జరుగుతున్నదనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

పానిపట్ కోసం గుండుతో

పానిపట్ కోసం గుండుతో

ప్రస్తుతం అర్జున్ కపూర్ దర్శకుడు, లగాన్ ఫేం అశుతోష్ గోవారికర్ రూపొందించే పానిపట్ చిత్రంలో నటిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతుననది. ఈ పాత్ర కోసం అర్జున్ కపూర్ గుండు కొట్టించుకోవడం గమనార్హం. ఈ చిత్రంలో పూర్తిగా గుండుతో కనిపిస్తాడట.

 మీడియాకు ముఖం చాటేసి

మీడియాకు ముఖం చాటేసి

గుండు కొట్టించుకొన్న తర్వాత సోమవారం (నవంబర్ 20న) గోవారికర్ ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్తూ మీడియా కెమెరాకు చిక్కాడు. హూడీ ధరించి, ముఖానికి, తలకు నల్లటి స్క్రార్ఫ్ కట్టుకొని వెళ్లడం మీడియా కంటపడింది. గతంలో గజనీ సినిమా కోసం అమీర్ ఖాన్ గుండు కొట్టించుకొన్న సంగతి తెలిసిందే.

మూడో పానిపట్ యుద్దం ఆధారంగా

మూడో పానిపట్ యుద్దం ఆధారంగా

మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా పానిపట్ చిత్రం తెరకెక్కుతున్నది. 1761లో మరాఠాలకు, అఫ్ఘనిస్థాన్‌కు మధ్య జరిగిన కథను అశుతోష్ గోవారికర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 23వ తేదీన సెట్స్‌పైకి వెళ్తుంది.

భారీగా సెట్‌ రూపకల్పన

భారీగా సెట్‌ రూపకల్పన

పానిపట్ సినిమా కోసం కర్జత్‌లోని ఎన్డీ స్టూడియోలో భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. కునాల్ కపూర్, మెహనీష్ బెహల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా 2019, డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

మేకప్‌తో సరిపెట్టుకోకుండా

మేకప్‌తో సరిపెట్టుకోకుండా

అర్జున్ కపూర్ డిసెంబర్ 25న షూటింగ్‌కు హాజరవుతాడు. ఫీష్వా వంశానికి చెందిన వారంతా ఈ సినిమాలో గుండుతో కనిపిస్తారు. సాధారణంగా గుండుతో కనిపించాలనుకొంటే ఓ రకమైన మేకప్‌తో సరిపెట్టుకొంటారు. కానీ అర్జున్ కపూర్ గుండు కొట్టించుకోవడానికి వెనుకాడలేదు అని చిత్ర యూనిట్ సభ్యుడొకరు చెప్పారు.

మలైకా అరోరాతో డేటింగ్

మలైకా అరోరాతో డేటింగ్

కాగా, బాలీవుడ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరాతో అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్నాడు. వారిద్దరూ పెళ్లికి కూడా సిద్ధపడినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జూన్, లేదా జూలైలో వీరిద్దరి పెళ్లి చేసుకొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ నుంచి మలైకా విడాకులు పొందిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X