కలిసి తిరిగేది దాయని వాళ్లం.. దాని గురించి రహస్యంగా ఉంచుతామా: డేటింగ్‌పై యంగ్ హీరో
మిగిలిన రంగాలతో పోలిస్తే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమాయణం సాగిస్తుంటారు. ఇది దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. హీరో హీరోయిన్లు కొద్ది రోజుల పాటు డేటింగులో మునిగి తేలడం.. ఆ తర్వాత నచ్చితే పెళ్లి చేసుకోవడం.. లేకుంటే బ్రేకప్ చెప్పేయడం అక్కడ కామన్. ఈ సంగతి ఎన్నో జంటల విషయంలో సుస్పష్టమైంది. అయితే, ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ జంట మాత్రం పెళ్లి కాకుండానే కలిసి ఉంటోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇంతకీ వాళ్లెవరు..? ఎందుకు కలిసి ఉంటున్నారు..? పూర్తి వివరాల్లోకి వెళితే...
Recommended Video

డేటింగ్ చేస్తున్నామంటూ ప్రకటన
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్.. నటి మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వాళ్లే బహిరంగంగానే చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ‘కాఫీ విత్ కరణ్' షోలో అర్జున్.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా కొద్ది రోజుల క్రితం అర్జున్ ఫొటోను షేర్ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్ చేసింది.

ఇద్దరి మధ్య తేడా తెలిస్తే..
డేటింగులో ఉన్న ఈ బాలీవుడ్ జంట అందరి కంటే కొంచెం భిన్నమనే చెప్పాలి. దీనికి కారణం వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉండడమే. అదీ కాక 45 ఏళ్ల మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చింది. 33 ఏళ్ల అర్జున్ మాత్రం ఇప్పటి వరకు ఎవరితోనూ డేటింగ్ చేసిన సందర్భాలు కూడా లేవు. అందుకే వీళ్ల ప్రేమ బీ టౌన్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

అందరికీ తెలియడంతో కలిసే ఉంటున్నారు
ప్రేమ వ్యవహారం బహిరంగం అయింది కదా ఇంకేంటి అనుకుంటున్నారో ఏమో.. మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ కొన్ని నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని కూడా వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత కలిసే పార్టీలు, పబ్బులను చుట్టేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

దాని గురించి రహస్యంగా ఉంచుతామా
అర్జున్ కపూర్ తాజాగా ‘పానిపట్' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ మలైకాతో పెళ్లి గురించి అర్జున్‌ను ప్రశ్నించాడు. దీనికి ‘కలిసి తిరుగుతున్నాం అని చెప్పడానికి సిగ్గు పడని వాళ్లం.. పెళ్లి గురించి దాస్తామా.? మా పెళ్లి ఎప్పుడైనా అందరికీ చెప్పే చేసుకుంటాం' అని బదులిచ్చాడు.


Click it and Unblock the Notifications











