వాటి నుంచి సుశాంత్‌‌ను తప్పించారు.. నిన్ను చూస్తే సిగ్గేస్తుంది.. అర్జున్ కపూర్‌పై నెటిజన్స్ ఫైర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. గత ఆదివారం (జూన్ 14) సుశాంత్ ఉరి వేసుకుని ప్రాణాలు విడిచిన ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. అయితే సుశాంత్ మృతికి మాత్రం బాలీవుడ్ నెపోటిజమే కారణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గడిచిన వారం రోజులుగా బాలీవుడ్ సెలెబ్రిటీలపై ఫైర్ అవుతూనే ఉన్నారు. రోజుకో ఓ సెలెబ్రిటీ, స్టార్ కిడ్ అన్నట్టుగా టార్గెట్ చేస్తున్నారు. నేడు అర్జున్ కపూర్‌పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

Sushant Singh Rajput : Sushant సూసైడ్.. Arjun Kapoor పై నెటిజన్లు ఆగ్రహం! || Oneindia Telugu
సుశాంత్ మృతి..

సుశాంత్ మృతి..

సుశాంత్ సింగ్ గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌కు లోనవడం, చివరగా గత ఆదివారం ఉరేసుకున్నాడు. సినీ అవకాశాలు లేకపోవడంతోనే ఇలా చేశారని అందరూ అనుకుంటున్నారు. ప్రేమ వ్యవహారమే అని ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుశాంత్ మృతి వల్ల బాలీవుడ్ నెపోటిజం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది.

అందరిపై ఫైర్..

అందరిపై ఫైర్..

బాలీవుడ్ సెలెబ్రిటీలను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వస్తోంది సోషల్ మీడియా ప్రపంచం. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్, అలియా భట్, షారుఖ్ ఖాన్, సోనమ్ కపూర్ ఇలా ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా ఓ ట్వీట్ కూడా చేశాడు.

నెపోటిజంపై ప్రశ్నలు..

నెపోటిజంపై ప్రశ్నలు..

బాలీవుడ్‌లో పాతుకుపోయిన నెపోటిజంపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. కంగనా రనౌత్, వివేక్ ఒబేరాయ్, అభినవ్ కశ్యప్, సోను నిగమ్, పాయల్ ఘోష్, నికీషా పటేల్ వంటి వారు బాలీవుడ్ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. నెపోటిజాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అర్జున్ కపూర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సినిమా నుంచి తప్పించారు..

సినిమా నుంచి తప్పించారు..

సుశాంత్‌ను ఎన్నో సినిమాల నుంచి తప్పించారని, ముందు హీరోగా ప్రకటించి ఎన్నోసార్లు సైడ్ చేసేశారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అందులో భాగంగా చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌లో మొదటగా సుశాంత్‌ను హీరోగా ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా చేతన్ భగతే ట్వీట్ చేశాడు.

సిగ్గేస్తోంది..

సిగ్గేస్తోంది..

ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తూ.. నిన్ను చూస్తే సిగ్గేస్తోందని అర్జున్ కపూర్‌పై ఫైర్ అవుతున్నారు. ఇదే కాకుండా ఫితూర్ సినిమాలోనూ సుశాంత్‌ను తప్పించి ఆదిత్య రాయ్ కపూర్‌ను తీసుకున్నారని, బేఫికర్‌లోనూ సుశాంత్‌ను పక్కకకు పెట్టేసి రణ్‌వీర్ సింగ్‌ను తీసుకున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X