twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్ కపూర్ లుక్ కేక.. ఆరోగ్యం క్షీణించింది.. అయినా తప్పలేదు

    |

    కపూర్ వారసుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అర్జున్ కపూర్ ఇప్పటి వరకు ఘనమైన హిట్‌ను ఖాతాలో వేసుకోలేకపోయాడు. సాధారణ విజయాలతో సరిపుచ్చుకొంటున్న ఈ యువ హీరో ప్రస్తుతం తనను స్టార్ హీరోగా మార్చుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా మారడానికి పానిపట్ అనే సినిమా కోసం విశేషంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం అర్జున్ కపూర్ గుండు కూడా కొట్టించుకోవడానికి సిద్ధపడ్డాడు. తాజాగా బాహుబలి లాంటి దేహధారుడ్యంతో కేక పెట్టిస్తున్నాడు. యుద్ధవీరుడికి ఏ మాత్రం తగ్గని విధంగా కండల వీరుడిగా అవతారం ఎత్తాడు. పానిపట్ చిత్రాన్ని లగాన్ ఫేం డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

    తన లుక్ గురించి అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. నేను వీరుడిగా కనిపించే సామర్థ్యం ఉందని ఈ గెటప్‌తో తెలిసింది. ప్రేక్షకులకు నిజాయితీగా నా ఫెర్ఫార్మెన్స్‌ను చూపించాలను కొంటున్నాను. 500 రూపాయల టికెట్ కొని సినిమాను వినోదించడానికి వచ్చే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలనుకొన్నాను అని అన్నారు.

    Arjun Kapoor look in panipat goes viral

    యుద్ద వీరుడిగా తెరపైన కనిపించడానికి నేను పూర్తిగా నా దేహాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొన్నాను. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించింది. కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడం బాగుండదు. నేను నా బాల్యంలో బరువుతో బాధపడేవాడిని. వాటిని అధిగమించి ఇప్పుడు మీకు ఇలా కనిపించడానికి నేను చాలా కష్టపడ్డాను అని అర్జున్ కపూర్ పేర్కొన్నారు.

    పాత్ర కోసం నేను చాలా బరువు తగ్గాను. గుండుతో షూటింగ్ చేశాను. నా రూపం చూసి డైరెక్టర్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ రకమైన బాడీ ఉండాలని ఆయన కోరుకొన్నాడు. నేను అందుకు సిద్దపడ్డాను అని అర్జున్ కపూర్ వెల్లడించారు.

    English summary
    Bollywood Arjun Kapoor look in panipat goes viral. Arjun added that he has been battling health issues for a while, but now he is back to looking his best after shedding some weight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X