మందు, విందు, ప్రియుడితో పసందు... హాట్ బ్యూటీ ఫోటోస్ వైరల్!
మలైకా అరోరా, అర్జున్ కపూర్... ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం బహిరంగ రహస్యమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్భాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత అందుకు సంబంధించిన డిస్ట్రబెన్స్ వల్ల మలైకా కొంతకాలం బాధలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ఆమె జీవితంలోకి వచ్చిన అర్జున్ కపూర్ మలైకా లైఫ్‌లోకి మళ్లీ హ్యాపీనెస్ తీసుకొచ్చి ఆమెకు మరింత దగ్గరయ్యాడని చెబుతుంటారు.
తాము రిలేషన్ షిప్‌లో ఉన్నామనే విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించకుండా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కొనసాగిస్తూ దోబూచులాడుతున్నారు. అయితే ఫోటోస్ రూపంలో ఇందుకు సంబంధించిన సంకేతాలు అభిమానుల్లోకి స్ప్రెడ్ చేయడం ద్వారా తమ సంబంధంపై క్రమక్రమంగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు.

మహీప్ కపూర్ పార్టీలో...
తాజాగా గురువారం రాత్రి ముంబైలో మహీప్ కపూర్ ఇచ్చిన పార్టీకి అర్జున్, మలైకా హాజరయ్యారు. ఈ పార్టీలో కరీనా కపూర్ ఖాన్, అమృత అరోరాని, సోఫీ చౌదరి, సోహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్.... సైతం ఉన్నారు. తన ప్రియుడు అర్జున్ కపూర్ పక్కనే నిల్చుని మలైకా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

మందు, విందు, పసందు...
ఈ పార్టీలో ఇంపోర్టెడ్ వైన్‌తో పాటు రుచికరమైన వంటకాలు సర్వ్ చేశారట. మలైకా-అర్జున్ కపూర్ రిలేషన్ షిప్‌కు ఈ గ్యాంగ్ మద్దతు ఇవ్వడంతో పాటు వారిని మరింత ఎంకరేజ్ చేసినట్లు ఈ ఫోటోస్ చూస్తే స్పష్టమవుతోంది.

కరీనా, అమృత, కరీనా
కరీనా కపూర్, అమృత అరోరా, సీమా ఖాన్.... బాలీవుడ్లో ఏ పార్టీ జరిగినా ఈ గర్ల్ గ్యాంగ్ అంతా తప్పకుండా అందులో ఉంటారు.

వైరల్ అవుతున్న ఫోటోస్
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో మలైకా, అర్జున్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











