పెళ్లి వద్దు కానీ ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం: హీరోకు తేల్చిచెప్పిన నటి.. అందుకే అలా దొరుకుతున్నారు.!

Recommended Video

Arjun Kapoor & Malaika Arora Relation Gearing Up Heat In Bollywood || Filmibeat Telugu

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమాయణం సాగిస్తుంటారు. ఇది దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నాళ్ల పాటు డేటింగులో మునిగి తేలడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేయడం అక్కడ కామన్. ఈ విషయం ఎన్నో జంటల విషయంలో సుస్పష్టమైంది. అయితే, తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన వాళ్లు కూడా ఉన్నారునుకోండి. ఇక, ఇప్పుడు మాట్లాడుకోబోయే జంట మాత్రం అన్నింటికీ భిన్నం అనే చెప్పాలి. ఈ జంట మరెవరో కాదు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్.

డేటింగ్‌లో ఉన్నామంటూ ప్రకటన

డేటింగ్‌లో ఉన్నామంటూ ప్రకటన

మామూలుగానే సెలెబ్రిటీలు ఎవరైనా కలిసి తిరిగితే వాళ్ల మధ్య ఏదోటి ఉందని ప్రచారం చేసేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా మాత్రం కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నామని బహిరంగంగానే చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ‘కాఫీ విత్‌ కరణ్‌' షోలో అర్జున్‌.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా ఇటీవల అర్జున్‌ ఫొటోను షేర్‌ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసింది.

ఇద్దరికీ చాలా తేడా

ఇద్దరికీ చాలా తేడా

వీళ్లు ప్రేమించుకున్నా అందరిలా ఈ జంటను వదలడం లేదు. దీనికి కారణం వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉంది. అదీ కాక 45 ఏళ్ల మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చింది. 33 ఏళ్ల అర్జున్ మాత్రం ఇప్పటి వరకు ఎవరితోనూ డేటింగ్ చేసిన సందర్భాలు కూడా లేవు. అందుకే వీళ్ల ప్రేమ బీ టౌన్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు

ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు

ప్రేమ బహిరంగం కావడంతో మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ కలిసే ఉంటున్నారు. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తున్నారు. ఇలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు. వీళ్ల ఫొటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌లోని ఫొటోగ్రాఫర్లు కూడా వీళ్లు కనిపిస్తే టక్కున ఫొటోలు కొట్టేస్తున్నారు. అందుకే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బీ టౌన్‌లో చర్చనీయాంశం అవుతున్నారు.

పెళ్లి వద్దు కానీ ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం

పెళ్లి వద్దు కానీ ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం

ప్రస్తుతం డేటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పెళ్లి విషయంలో అర్జున్ కపూర్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ మలైకా మాత్రం ఇష్టపడడంలేదట. ఇప్పటికే వివాహ బంధం చేదు అనుభవంగా మిగిలిపోవడంతో ఆమె పెళ్లికి ఆసక్తి చూపడం లేదని బీ టౌన్‌లో వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X